Aadavaddaa ne maamtalu aabegemi

ఆడవద్దా నే మాఁటలు ఆపెకేమి
Language

(॥పల్లవి॥)
ఆడవద్దా నే మాఁటలు ఆపెకేమి
యీడకుఁ దోడి తెచ్చితి విఁకనేమి

(॥ఆడ॥)
నిక్కి నిన్నుఁ బాసి నేను నీ కెదురు చూచుకొంటా
అక్కడ నెంతవుండినా నాపెకేమి
వెక్కసపు నవ్వు నవ్వి వేఁడుకొనీ నిప్పు డిట్టె
దక్కీ దనపంతమెల్లా తనకేమి

(॥ఆడ॥)
నిలిచి బలిమినైనా నిన్నుఁ దోడితెచ్చేనంటా
అలసి నే వచ్చితేను ఆపె కేమి
అలుకలు నన్నుఁ దేర్చి అట్టి శాంతాలు నెరపీ
యెలయించెఁ దా మునుపే యిఁక నేమి

(॥ఆడ॥)
కదిసి శ్రీ వేంకటేశ కలసితి విపుడు నే
నదను గాచుకవుంటే నాపెకేమి
పొదిగి నాకు బొక్కి బొగడించుకొని నీచే
హృదయము చల్లనాయ నిఁక నేమి

(||pallavi||)
āḍavaddā ne mām̐ṭalu ābĕgemi
yīḍagum̐ doḍi tĕchchidi vim̐kanemi

(||āḍa||)
nikki ninnum̐ bāsi nenu nī kĕduru sūsugŏṁṭā
akkaḍa nĕṁtavuṁḍinā nābĕgemi
vĕkkasabu navvu navvi vem̐ḍugŏnī nippu ḍiṭṭĕ
dakkī danabaṁtamĕllā tanagemi

(||āḍa||)
nilisi baliminainā ninnum̐ doḍidĕchchenaṁṭā
alasi ne vachchidenu ābĕ kemi
alugalu nannum̐ dersi aṭṭi śhāṁtālu nĕrabī
yĕlayiṁchĕm̐ dā munube yim̐ka nemi

(||āḍa||)
kadisi śhrī veṁkaḍeśha kalasidi vibuḍu ne
nadanu gāsugavuṁṭe nābĕgemi
pŏdigi nāgu bŏkki bŏgaḍiṁchugŏni nīse
hṛdayamu sallanāya nim̐ka nemi