ఆటవానికివలెఁ దోడయ్యీఁ బ్రకృతి
(॥పల్లవి॥)
ఆటవానికివలెఁ దోడయ్యీఁ బ్రకృతి
గాటపు జీవుని కెంత కైవసమో ప్రకృతి
(॥ఆట॥)
చాటి చదివినవెల్లా సారెఁ దలంపించి యిచ్చు
పాటించి యక్షిణి విద్య ప్రకృతి
తేటగాఁ దొల్లిఁటి జన్మము దెచ్చి యీ జన్మాన నిచ్చు
చీటికి మాటికి యిచ్చిన దిచ్చుఁ బ్రకృతి
(॥ఆట॥)
వొక్కచో నుండినవాని నొక్కచోఁ బొడచూపించును
పక్కన పాసికవిద్య ప్రకృతి
దుక్కినేలఁ జల్లిన విత్తులు కొటారు కెక్కించు
వొక్కటే యనేకముగా నొనరించుఁ బ్రకృతి
(॥ఆట॥)
మనసులోఁ దలఁచితే మర్మములు గరఁగించు
పనివడి యింద్రజాలమై ప్రకృతి ప్రకృతి
యేనలేని శ్రీవేంకటేశ యీ జీవులకు
పనిగొంటివి సంసారఫలము యీ ప్రకృతి
(||pallavi||)
āḍavānigivalĕm̐ doḍayyīm̐ brakṛti
gāḍabu jīvuni kĕṁta kaivasamo prakṛti
(||āḍa||)
sāḍi sadivinavĕllā sārĕm̐ dalaṁpiṁchi yichchu
pāḍiṁchi yakṣhiṇi vidya prakṛti
teḍagām̐ dŏllim̐ṭi janmamu dĕchchi yī janmāna nichchu
sīḍigi māḍigi yichchina dichchum̐ brakṛti
(||āḍa||)
vŏkkaso nuṁḍinavāni nŏkkasom̐ bŏḍasūbiṁchunu
pakkana pāsigavidya prakṛti
dukkinelam̐ jallina vittulu kŏḍāru kĕkkiṁchu
vŏkkaḍe yanegamugā nŏnariṁchum̐ brakṛti
(||āḍa||)
manasulom̐ dalam̐side marmamulu garam̐giṁchu
panivaḍi yiṁdrajālamai prakṛti prakṛti
yenaleni śhrīveṁkaḍeśha yī jīvulagu
panigŏṁṭivi saṁsāraphalamu yī prakṛti