Aadaro paadaro ashpa(psa?)roganamu

ఆడరో పాడరో అష్ప(ప్స?)రోగణము
Language

(॥పల్లవి॥)
ఆడరో పాడరో అష్ప(ప్స?)రోగణము
వీడెము లిందరో విభవము నేఁడు

(॥ఆడ॥)
కమలారమణునికల్యాణమునకు
తమినదె గరుడద్వజ మెనఁగె
తెమలుచు మ్రోసెను దివ్వదుందుభులు
గమనించరో దివిఁగలదేవతలు

(॥ఆడ॥)
వెలయఁగ లక్ష్మీ విభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షతలవె
చెలఁగి కైకోనరో శ్రీవైష్ణవులు

(॥ఆడ॥)
బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి
అడరినతలఁబా లందెనిదె
నడచీఁ బరుషలు నానాముఖముల
ముడుపులు చదువరో ముయిగా నరులు

(||pallavi||)
āḍaro pāḍaro aṣhpa(psa?)rogaṇamu
vīḍĕmu liṁdaro vibhavamu nem̐ḍu

(||āḍa||)
kamalāramaṇunigalyāṇamunagu
taminadĕ garuḍadvaja mĕnam̐gĕ
tĕmalusu mrosĕnu divvaduṁdubhulu
gamaniṁcharo divim̐galadevadalu

(||āḍa||)
vĕlayam̐ga lakṣhmī vibhuni pĕṁḍligini
balasi aṁkurārbaṇa madivo
kalagŏna nichcheru gaṁdhākṣhadalavĕ
sĕlam̐gi kaigonaro śhrīvaiṣhṇavulu

(||āḍa||)
baḍi śhrīveṁkaḍabadigi śhrīsadigi
aḍarinadalam̐bā laṁdĕnidĕ
naḍasīm̐ baruṣhalu nānāmukhamula
muḍubulu saduvaro muyigā narulu