Aadarimchavayyaa amgana nimtadanainaa

ఆదరించవయ్యా అంగన నింతటనైనా
Language

(॥పల్లవి॥)
ఆదరించవయ్యా అంగన నింతటనైనా
పోది వలపులు తలపోయుచున్నది

(॥॥)
చెప్పరాని ప్రియములు చేరి మీకుఁ జెప్పఁగాను
దప్పి దేరీ మోవిమీఁద తరుణికిని
వుప్పతిల్లు సేవ నీకు వొద్దనుండి సేయఁగాను
చిప్పిలఁగఁ జెమరించె చెక్కులెల్లాను

(॥॥)
ననుపులు చేసుకొని నవ్వు నీతోనవ్వఁగాను
నినుపులై నిగిడీని నిట్టూర్పులు
తనియక వీడెమిచ్చి తగ నిన్ను వేఁడుకోఁగా
వొనరెను పులకలు వొళ్ల నెల్లాను

(॥॥)
కలికితనాలు చూపి కాఁగిలించు కొనఁగాను
మలసీని కోరికలు మనసునను
అలమేలుమంగ నేలి తట్టె శ్రీ వేంకటేశ
నెలకొనె వేడుకలు నిలువెల్లాను

(||pallavi||)
ādariṁchavayyā aṁgana niṁtaḍanainā
podi valabulu talaboyusunnadi

(||||)
sĕpparāni priyamulu seri mīgum̐ jĕppam̐gānu
dappi derī movimīm̐da taruṇigini
vuppadillu seva nīgu vŏddanuṁḍi seyam̐gānu
sippilam̐gam̐ jĕmariṁchĕ sĕkkulĕllānu

(||||)
nanubulu sesugŏni navvu nīdonavvam̐gānu
ninubulai nigiḍīni niṭṭūrbulu
taniyaga vīḍĕmichchi taga ninnu vem̐ḍugom̐gā
vŏnarĕnu pulagalu vŏḽla nĕllānu

(||||)
kaligidanālu sūbi kām̐giliṁchu kŏnam̐gānu
malasīni korigalu manasunanu
alamelumaṁga neli taṭṭĕ śhrī veṁkaḍeśha
nĕlagŏnĕ veḍugalu niluvĕllānu