(॥పల్లవి॥)
ఆడరానిమా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే
(॥॥)
కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే
(॥॥)
దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ-
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే
(॥॥)
పరిపరివిధములఁ బలుకలు గులుకఁగ
అరమరచి చొక్కినది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే
(||pallavi||)
āḍarānimā ṭadi guṟudu
veḍugadone vichcheyumanave
(||||)
kāyajageligim̐ gaḍum̐ damagiṁcham̐ga
āyamu laṁṭina dadi guṟudu
pāyabum̐badiginim̐ bariṇāmu sĕppi
moyusum̐ dana kiḍu mŏkkidinanave
(||||)
dappimovido tā nanum̐ diṭṭam̐ga-
nappuḍu navvina dadi guṟudu
yippuḍu danarū piḍu dalam̐si bayalu
sippilam̐ gām̐giḍam̐ jersidinanave
(||||)
paribarividhamulam̐ balugalu gulugam̐ga
aramarasi sŏkkinadi guṟudu
paraga śhrīveṁkaḍabadi kaḍabalona
saravim̐gūḍĕ nim̐ka sammadiyanave