(॥పల్లవి॥)
ఆడరాదు వీడరాదు అంతమాట
వేడుకవలపు లింతే వేసాలు మానరా
(॥ఆడ॥)
బిగిసేవు దగ్గరితే పిలిచితే నవ్వేవు
తెగనాడరా మాట తెలియ నేను
మొగము చూచితి నింతే మోనాన నుందాన నింతే
చిగురు నీమోవికిని సిగ్గులేల వచ్చెరా
(॥ఆడ॥)
ములిగేవు పైకొంటే మొక్కితేనే నీలిగేవు
వొలసీనొల్లములైతే వొద్దురా పొందు
నిలుచుండి వుంటి నింతే నేరము లెంచుకొంటి నింతే
వలుదకన్నులరెప్పవంపు లేల వచ్చెరా
(॥ఆడ॥)
చెనకితే వీఁగేవు చెఱఁగువట్టితే రేఁగే
వనుమాన మేమిగల్లా నాడరా నాతో
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి వప్పటిని
మనసు లొక్కట్లాయ మఱి యానలేలరా
(||pallavi||)
āḍarādu vīḍarādu aṁtamāḍa
veḍugavalabu liṁte vesālu mānarā
(||āḍa||)
bigisevu daggaride piliside navvevu
tĕganāḍarā māḍa tĕliya nenu
mŏgamu sūsidi niṁte monāna nuṁdāna niṁte
siguru nīmovigini siggulela vachchĕrā
(||āḍa||)
muligevu paigŏṁṭe mŏkkidene nīligevu
vŏlasīnŏllamulaide vŏddurā pŏṁdu
nilusuṁḍi vuṁṭi niṁte neramu lĕṁchugŏṁṭi niṁte
valudagannularĕppavaṁpu lela vachchĕrā
(||āḍa||)
sĕnagide vīm̐gevu sĕṟam̐guvaṭṭide rem̐ge
vanumāna memigallā nāḍarā nādo
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi vappaḍini
manasu lŏkkaṭlāya maṟi yānalelarā