Aadanumdi vachchi naagu aasabadevu

ఆడనుండి వచ్చి నాకు ఆసపడేవు
Language

(॥పల్లవి॥)
ఆడనుండి వచ్చి నాకు ఆసపడేవు
జోడుకూడి నిన్ను రతిఁ జొక్కించదాయనా

(॥ఆడ॥)
పైపై నన్నుఁ జెనకేవు పాఁచి మేనితో వచ్చి
ఆపె వోపనప్పుడెల్లా నడ్డమా నేను
కోపము గాదుగా గొబ్బన నిన్నడిగితి
ఆ పాటి నిన్నుఁ దనివి నందించదాయనా

(॥ఆడ॥)
పట్టి విడె మడిగేవు పరఁగడుపునవచ్చి
వొట్టి యాపె వూడిగాల కూరటా నేను
దిట్టతనమున నిన్నుఁ దెలియవలసి యింతె
బెట్టుగఁ దమ్ములమైనాఁ బెట్టదాయనా

(॥ఆడ॥)
వంచి నామోము చూచేవు వరవాత లేచివచ్చి
అంచెనాచేఁతను చూడ నడ్డమా నేను
కొంచక శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నీకు
మంచి మొగాలవారి నెమ్మదిఁ జూపదాయనా

(||pallavi||)
āḍanuṁḍi vachchi nāgu āsabaḍevu
joḍugūḍi ninnu radim̐ jŏkkiṁchadāyanā

(||āḍa||)
paibai nannum̐ jĕnagevu pām̐si menido vachchi
ābĕ vobanappuḍĕllā naḍḍamā nenu
kobamu gādugā gŏbbana ninnaḍigidi
ā pāḍi ninnum̐ danivi naṁdiṁchadāyanā

(||āḍa||)
paṭṭi viḍĕ maḍigevu param̐gaḍubunavachchi
vŏṭṭi yābĕ vūḍigāla kūraḍā nenu
diṭṭadanamuna ninnum̐ dĕliyavalasi yiṁtĕ
bĕṭṭugam̐ dammulamainām̐ bĕṭṭadāyanā

(||āḍa||)
vaṁchi nāmomu sūsevu varavāda lesivachchi
aṁchĕnāsem̐tanu sūḍa naḍḍamā nenu
kŏṁchaga śhrī veṁkaḍeśha kūḍidivi nannu nīgu
maṁchi mŏgālavāri nĕmmadim̐ jūbadāyanā