Aadanumdemi tagavulatte seppevu

ఆడనుండేమి తగవులట్టె చెప్పేవు
Language

(॥పల్లవి॥)
ఆడనుండేమి తగవులట్టె చెప్పేవు
నీడల నిన్నియునాయ నీ కడమే యిఁకను

(॥ఆడ॥)
పలుకఁగ నేర్తువు పాదాలు గుద్దనేర్తువు
సొలసి వాకిలి దెరచుక రాఁగదే
అలుక దీర్చఁ గలవు ఆయములంటఁగలవు
బలిమి నీపతితొడపైఁ గూచుండఁగదే

(॥ఆడ॥)
పగడసాలాడుదువు పక్కన నవ్వింతువు
మొగము చూపీతనికి మొక్కఁగదవే
పొగడుదు విచ్చెరిఁగి పొద్దులు గొంతవుత్తువు
మగని ముసుఁ గుదీసి మంతనమాడఁగదే

(॥ఆడ॥)
వీడెము చేతికిత్తువు వెరపులు వాపుదువు
తోడఁ బెండ్లి కూఁతురవై తొక్కవే కాలు
యీడనె శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడె
జాడనేనంతెరఁగను సరసమాడఁగదే

(||pallavi||)
āḍanuṁḍemi tagavulaṭṭĕ sĕppevu
nīḍala ninniyunāya nī kaḍame yim̐kanu

(||āḍa||)
palugam̐ga nerduvu pādālu guddanerduvu
sŏlasi vāgili dĕrasuga rām̐gade
aluga dīrsam̐ galavu āyamulaṁṭam̐galavu
balimi nībadidŏḍabaim̐ gūsuṁḍam̐gade

(||āḍa||)
pagaḍasālāḍuduvu pakkana navviṁtuvu
mŏgamu sūbīdanigi mŏkkam̐gadave
pŏgaḍudu vichchĕrim̐gi pŏddulu gŏṁtavuttuvu
magani musum̐ gudīsi maṁtanamāḍam̐gade

(||āḍa||)
vīḍĕmu sedigittuvu vĕrabulu vābuduvu
toḍam̐ bĕṁḍli kūm̐turavai tŏkkave kālu
yīḍanĕ śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐gūḍĕ
jāḍanenaṁtĕram̐ganu sarasamāḍam̐gade