Aadanumde soosi veragamdidi nenu

ఆడనుండే చూచి వెరగందితి నేను
Language

(॥పల్లవి॥)
ఆడనుండే చూచి వెరగందితి నేను
యీడ నన్నుఁ గాఁగిలించే వేఁటిదో యెఱఁగను

(॥॥)
సొలపుఁ జూపులఁ జూచి సుద్దులు నీతోఁ జెప్పి
వలపులు చల్లెఁ నాపె వాడికగాను
కలువల యేసి కందువకు రమ్మని
పిలిచితి వెటువంటి ప్రియమో నీకును

(॥॥)
చనుఁగవపై పయ్యద చక్కఁ బెట్టుకొంటాను
వినయాన మొక్కి నాపె వేడుకగాను
ననిచి కై దండవట్టి నగరిలోనికిఁ దీసి
పెనఁగితి వాపె యెంతప్రియమో నీకును

(॥॥)
చేరి జాఱుఁ గొప్పు చేతఁ జెక్కుకొంటా మోముచూపి
సారె సన్న నేసి నాకె సమ్మతిగాను
గారవించి నన్నేలితివి గక్కన శ్రీ వేంకటేశ
బీరాన నాపె నెంతప్రియమో నీకును

(||pallavi||)
āḍanuṁḍe sūsi vĕragaṁdidi nenu
yīḍa nannum̐ gām̐giliṁche vem̐ṭido yĕṟam̐ganu

(||||)
sŏlabum̐ jūbulam̐ jūsi suddulu nīdom̐ jĕppi
valabulu sallĕm̐ nābĕ vāḍigagānu
kaluvala yesi kaṁduvagu rammani
pilisidi vĕḍuvaṁṭi priyamo nīgunu

(||||)
sanum̐gavabai payyada sakkam̐ bĕṭṭugŏṁṭānu
vinayāna mŏkki nābĕ veḍugagānu
nanisi kai daṁḍavaṭṭi nagarilonigim̐ dīsi
pĕnam̐gidi vābĕ yĕṁtapriyamo nīgunu

(||||)
seri jāṟum̐ gŏppu sedam̐ jĕkkugŏṁṭā momusūbi
sārĕ sanna nesi nāgĕ sammadigānu
gāraviṁchi nannelidivi gakkana śhrī veṁkaḍeśha
bīrāna nābĕ nĕṁtapriyamo nīgunu