ఆడనుం డేమి తగవు అంది చెప్పేవే
(॥పల్లవి॥)
ఆడనుం డేమి తగవు అంది చెప్పేవే
వాడిక లిన్నియునాయ వలపు నీకడమే
(॥ఆడ॥)
పలికించ నేరుతువు పాదా లొత్త నేరుతువు
సొలసి వాకిలి దీసి చొచ్చి రా గదే
అలుక దీర్చఁగలవు ఆయము లంటఁ గలవు
బలిమి నీ పతితోడఁ బవళించఁగదవే
(॥ఆడ॥)
పగడసా లాడుదువు పక్కన నవ్వింతువు
మొగము చూ పితనికి మొక్కఁగదవే
పొగడుదు విచ్చకమై పొద్దులు గొంత పుత్తువు
మగనిముఁసుగు చొచ్చి మంతనమాడఁగదే
(॥ఆడ॥)
వీడెము చేతి కిత్తువు వెఱపులు పాపుదువు
తోడఁ బెండ్లి కూఁతురవై తొక్కవే కాలు
యీడనే శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టే నన్ను గూడె
జాడలనే అంతరంగసరస మాడఁగదే
(||pallavi||)
āḍanuṁ ḍemi tagavu aṁdi sĕppeve
vāḍiga linniyunāya valabu nīgaḍame
(||āḍa||)
paligiṁcha neruduvu pādā lŏtta neruduvu
sŏlasi vāgili dīsi sŏchchi rā gade
aluga dīrsam̐galavu āyamu laṁṭam̐ galavu
balimi nī padidoḍam̐ bavaḽiṁcham̐gadave
(||āḍa||)
pagaḍasā lāḍuduvu pakkana navviṁtuvu
mŏgamu sū pidanigi mŏkkam̐gadave
pŏgaḍudu vichchagamai pŏddulu gŏṁta puttuvu
maganimum̐sugu sŏchchi maṁtanamāḍam̐gade
(||āḍa||)
vīḍĕmu sedi kittuvu vĕṟabulu pābuduvu
toḍam̐ bĕṁḍli kūm̐turavai tŏkkave kālu
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭe nannu gūḍĕ
jāḍalane aṁtaraṁgasarasa māḍam̐gade