Aadaninela saadimche ramganalaala

ఆతనినేల సాదించే రంగనలాల
Language

(॥పల్లవి॥)
ఆతనినేల సాదించే రంగనలాల
చేతికి లోనైనదాఁకా సేవసేసే మిఁకను

(॥ఆత॥)
పతియైన వానికి పట్టరానివలపైనా
సతులు పెక్కయితేనే చౌకలౌను
రతి నందరికిఁ గడురసమైనమోవితేనె
తతిగాక వుండితే నెంతయుఁ జప్పనౌను

(॥ఆత॥)
కూరిమి చుట్టమైనాను గుట్టువిడి చేపొద్దు
సారె మాటాడితే మొగచాటౌను
కోరి వేడుకతోడ గొనకొన్ననవ్వులు
పేరఁబెట్టుకొంటెనే పెనుఁగాక లవును

(॥ఆత॥)
అంటి వేరొక్క తెపొందు లాసపడేవానికి
వెంటవెంటఁదిరిగితే వేసటౌను
నంటున నిదివో కూడె నన్ను శ్రీవేంకటేశుఁడు
దంటతనానఁ బైకొంటే తరితీపు లౌను

(||pallavi||)
ādaninela sādiṁche raṁganalāla
sedigi lonainadām̐kā sevasese mim̐kanu

(||āda||)
padiyaina vānigi paṭṭarānivalabainā
sadulu pĕkkayidene saugalaunu
radi naṁdarigim̐ gaḍurasamainamovidenĕ
tadigāga vuṁḍide nĕṁtayum̐ jappanaunu

(||āda||)
kūrimi suṭṭamainānu guṭṭuviḍi sebŏddu
sārĕ māḍāḍide mŏgasāḍaunu
kori veḍugadoḍa gŏnagŏnnanavvulu
peram̐bĕṭṭugŏṁṭĕne pĕnum̐gāga lavunu

(||āda||)
aṁṭi verŏkka tĕbŏṁdu lāsabaḍevānigi
vĕṁṭavĕṁṭam̐dirigide vesaḍaunu
naṁṭuna nidivo kūḍĕ nannu śhrīveṁkaḍeśhum̐ḍu
daṁṭadanānam̐ baigŏṁṭe taridību launu