ఆతనినేల కొసరే వప్పటి నీవు నీ
(॥పల్లవి॥)
ఆతనినేల కొసరే వప్పటి నీవు నీ-
యేతులెల్లాఁ జూచెఁగదె ఇందాఁకాను
(॥॥)
నిన్నుఁ బేరుకొని పిల్చి నీతోనే మాటలాడి
యెన్నికలు సేసెఁగదె ఇందరిలోన
విన్నపాలెల్లా విని వీడెము చేతికిచ్చి
ఇన్నిటా లాలించెఁగదె ఇందాఁకాను
(॥॥)
సరసములెల్లా నాడి సంగడినే కూచుండి
అరుదుగా మొక్కెఁగదె అండనే వుండి
తెరవేసుకొని మోవితేనియలు నీకొసగి
ఇరవుగా నవ్వెఁగదె ఇందాఁకాను
(॥॥)
వొడివట్టి నినుఁ దీసి వొద్దిక జూజాలాడి
జడిగొనఁ గూడెఁగదె చవికెలోన
చిడుముడి నన్నునేలె శ్రీవేంకటేశుఁడు నేఁడు
యెడయఁడుగదె నిన్ను నిందాఁకాను
(||pallavi||)
ādaninela kŏsare vappaḍi nīvu nī-
yedulĕllām̐ jūsĕm̐gadĕ iṁdām̐kānu
(||||)
ninnum̐ berugŏni pilsi nīdone māḍalāḍi
yĕnnigalu sesĕm̐gadĕ iṁdarilona
vinnabālĕllā vini vīḍĕmu sedigichchi
inniḍā lāliṁchĕm̐gadĕ iṁdām̐kānu
(||||)
sarasamulĕllā nāḍi saṁgaḍine kūsuṁḍi
arudugā mŏkkĕm̐gadĕ aṁḍane vuṁḍi
tĕravesugŏni movideniyalu nīgŏsagi
iravugā navvĕm̐gadĕ iṁdām̐kānu
(||||)
vŏḍivaṭṭi ninum̐ dīsi vŏddiga jūjālāḍi
jaḍigŏnam̐ gūḍĕm̐gadĕ savigĕlona
siḍumuḍi nannunelĕ śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu
yĕḍayam̐ḍugadĕ ninnu niṁdām̐kānu