(॥పల్లవి॥)
ఆతనినే రమ్మనరే అంగనలాల
యీతలనే విన్నవించే నిన్ని విన్నపములూ
(॥॥)
అరతఁ జేసే విన్నపా లడియాసలై యుండు
తరి తీపులై యుండు దవ్వుల విన్నపములు
వొరుల విన్నపములు వొడఁ బాటులై తోఁచు
వెరవేది పతికింక విన్నవించ నిపుడూ
(॥॥)
చెవిలోని విన్నపాలు సిగ్గులెల్లాఁ బెడఁబాప
చవులెల్లాఁ బుట్టించు సరసపు విన్నపము
సవినయ విన్నపము సంతతముఁ దలపించు
వివర మేది పతికి విన్నవించ నిఁకను
(॥॥)
యేకతపు విన్నపము లిచ్చకము వుట్టించు
రాకొట్టులై పెనగొను రతివేళ విన్నపము
యీకడ శ్రీవేంకటేశుఁడే నలమేలు మంగను
చేకొని విన్నపములు సేసే దేమె యిఁకను
(||pallavi||)
ādanine rammanare aṁganalāla
yīdalane vinnaviṁche ninni vinnabamulū
(||||)
aradam̐ jese vinnabā laḍiyāsalai yuṁḍu
tari tībulai yuṁḍu davvula vinnabamulu
vŏrula vinnabamulu vŏḍam̐ bāḍulai tom̐su
vĕravedi padigiṁka vinnaviṁcha nibuḍū
(||||)
sĕviloni vinnabālu siggulĕllām̐ bĕḍam̐bāba
savulĕllām̐ buṭṭiṁchu sarasabu vinnabamu
savinaya vinnabamu saṁtadamum̐ dalabiṁchu
vivara medi padigi vinnaviṁcha nim̐kanu
(||||)
yegadabu vinnabamu lichchagamu vuṭṭiṁchu
rāgŏṭṭulai pĕnagŏnu radiveḽa vinnabamu
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelu maṁganu
segŏni vinnabamulu sese demĕ yim̐kanu