Aadanimaadagu viru namdaalu sepperu gaaga

ఆతనిమాటకు విూరు నందాలు చెప్పేరు గాక
Language

(॥పల్లవి॥)
ఆతనిమాటకు విూరు నందాలు చెప్పేరు గాక
దాతుమా తెఱిఁగి యింకా తగ వేఁటి తగవే

(॥ఆతని॥)
కూరిమే కలిగితేను కొసరి తిట్టిన తిట్టు
కోరినట్టే యిద్దరికిఁ గొటి సేసును
యీరసమైనవేళ యెంత చేయెత్తి మొక్కినా
తారముఁ జేయదు దీని తగ వేఁటి తగవే

(॥ఆతని॥)
చనవే కలిగితేను చవిదప్పిన పనైనా
పనికివచ్చి యప్పుడే ఫలియించును
ననుపు చాలనిచోట నగఁబోయినా నది
తనవి చాలదు దీని తగ వేఁటి తగవే

(॥ఆతని॥)
కలసినప్పటికిని కడమ దొడమ లేక
తలపోఁత వలపులు తల కెక్కును
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనన్నుఁ గలసె
తలిరుఁబోండ్లు మీ తగ వేటిఁ తగవే

(||pallavi||)
ādanimāḍagu viూru naṁdālu sĕpperu gāga
dādumā tĕṟim̐gi yiṁkā taga vem̐ṭi tagave

(||ādani||)
kūrime kaligidenu kŏsari tiṭṭina tiṭṭu
korinaṭṭe yiddarigim̐ gŏḍi sesunu
yīrasamainaveḽa yĕṁta seyĕtti mŏkkinā
tāramum̐ jeyadu dīni taga vem̐ṭi tagave

(||ādani||)
sanave kaligidenu savidappina panainā
panigivachchi yappuḍe phaliyiṁchunu
nanubu sālanisoḍa nagam̐boyinā nadi
tanavi sāladu dīni taga vem̐ṭi tagave

(||ādani||)
kalasinappaḍigini kaḍama dŏḍama lega
talabom̐ta valabulu tala kĕkkunu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonannum̐ galasĕ
talirum̐boṁḍlu mī taga veḍim̐ tagave