Aadanim joodavalemgaa annidaa nemu

ఆతనిఁ జూడవలెఁగా అన్నిటా నేము
Language

(॥పల్లవి॥)
ఆతనిఁ జూడవలెఁగా అన్నిటా నేము
చేతులొగ్గి చెప్పినట్టు సేసేమే యిఁకను

(॥॥)
సొరిది నాతనితోడ జోడుగూడుక వచ్చి
సిరులనెమ్మెలచేత చెలరేఁగేవే
దొరవౌదువంటాను తోడిసతులు మెచ్చేరు
మురిపెములు గంటిమి మొక్కేమే నీకు

(॥॥)
పొలయుచు రాజసాన పురుషుని సలిగెల
నలువంక నిఱ్ఱవీఁగి నవ్వునవ్వేవే
బలువురాలవంటాను పడఁతులు పొగడేరు
తెలిసితిమి పట్టపుదేవులవే నీవు

(॥॥)
కూరిమిశ్రీ వేంకటేశుఁ గూడినసంతోసాన
మేరమీరి యందరికి మేలు చూపేవే
యీరీతి నీతనిచేత నేలించితనే రిందరు
ఆరయ నలమేల్మంగ వౌదువే మన్ననల

(||pallavi||)
ādanim̐ jūḍavalĕm̐gā anniḍā nemu
sedulŏggi sĕppinaṭṭu seseme yim̐kanu

(||||)
sŏridi nādanidoḍa joḍugūḍuga vachchi
sirulanĕmmĕlaseda sĕlarem̐geve
dŏravauduvaṁṭānu toḍisadulu mĕchcheru
muribĕmulu gaṁṭimi mŏkkeme nīgu

(||||)
pŏlayusu rājasāna puruṣhuni saligĕla
naluvaṁka niṭravīm̐gi navvunavveve
baluvurālavaṁṭānu paḍam̐tulu pŏgaḍeru
tĕlisidimi paṭṭabudevulave nīvu

(||||)
kūrimiśhrī veṁkaḍeśhum̐ gūḍinasaṁtosāna
meramīri yaṁdarigi melu sūbeve
yīrīdi nīdaniseda neliṁchidane riṁdaru
āraya nalamelmaṁga vauduve mannanala