Aadanim joobave maagu nademta sakkanivaamdo

ఆతనిఁ జూపవె మాకు నదెంత చక్కనివాఁడొ
Language

(॥పల్లవి॥)
ఆతనిఁ జూపవె మాకు నదెంత చక్కనివాఁడొ
ఆ తఱి నిన్నుఁ గలసినంతటి జాణఁ డెవ్వఁడె

(॥॥)
జక్కవచన్నులమీఁద చంద్రోదయము లాయ
చుక్కలు నీమోవిమీఁదఁ జూపట్టెను
మిక్కిలి శిరసుమీఁద మేఘములు గారుకొనె
యెక్కడనుండి వచ్చేవే యెవ్వఁడే నీమగఁడు

(॥॥)
సరిఁ గన్ను కలువల సంధ్యాకాలము వచ్చె
అరిది సంపెంగముక్కం దాయిటి రేఁగె
తొరిగి చుక్కమీఁదఁ దొలుకరించెఁ జెమట
యిరవై యేడనుంటివే యెవ్వఁడే నీమగఁడు

(॥॥)
నాటుకొని సెలవుల నవ్వుల వెన్నెల గాసె
తేటలచూపులనే తెల్లవారెను
మేటిశ్రీవేంకటాద్రి దేవుఁడఁటా నీవు
యేట వెట్టుకుండెనాతఁ డెవ్వఁడే నీమగఁడు

(||pallavi||)
ādanim̐ jūbavĕ māgu nadĕṁta sakkanivām̐ḍŏ
ā taṟi ninnum̐ galasinaṁtaḍi jāṇam̐ ḍĕvvam̐ḍĕ

(||||)
jakkavasannulamīm̐da saṁdrodayamu lāya
sukkalu nīmovimīm̐dam̐ jūbaṭṭĕnu
mikkili śhirasumīm̐da meghamulu gārugŏnĕ
yĕkkaḍanuṁḍi vachcheve yĕvvam̐ḍe nīmagam̐ḍu

(||||)
sarim̐ gannu kaluvala saṁdhyāgālamu vachchĕ
aridi saṁpĕṁgamukkaṁ dāyiḍi rem̐gĕ
tŏrigi sukkamīm̐dam̐ dŏlugariṁchĕm̐ jĕmaḍa
yiravai yeḍanuṁṭive yĕvvam̐ḍe nīmagam̐ḍu

(||||)
nāḍugŏni sĕlavula navvula vĕnnĕla gāsĕ
teḍalasūbulane tĕllavārĕnu
meḍiśhrīveṁkaḍādri devum̐ḍam̐ṭā nīvu
yeḍa vĕṭṭuguṁḍĕnādam̐ ḍĕvvam̐ḍe nīmagam̐ḍu