ఆతనిఁ గొసరకురే అందేమున్నది
(॥పల్లవి॥)
ఆతనిఁ గొసరకురే అందేమున్నది
ఆతుమలో సరివచ్చె నందేమున్నది
(॥ఆతని॥)
చాయపాటుమాఁటలెల్ల చవిసేసుకొంటగాక
ఆయడఁ దప్పువట్టితే అందేమున్నది
శేయరానిచేఁత చూచి సెలవి నవ్వుటగాక
ఆయరత దిద్దఁబోతే అందేమున్నది
(॥ఆతని॥)
ఒలిసి నొల్లని వలపొడిఁ బెట్టుకొంటగాక
అలిగి సొలయఁబోతే అందేమున్నది
బలిమి చుట్టరికము పైఁబొదుగుటగాక
అలరి విచ్చి చూచితే నందేమున్నది
(॥ఆతని॥)
ఎగసక్కేలేమి గల్లా యెదఁబెట్టుకొంటగాక
అగడు శాయఁబోతే నందేమున్నది
నిగిడి శ్రీ వెంకటాద్రి నిలయుఁడే నన్నుఁగూడె
అగపడ్డ మీఁద నేరాలందేమున్నది
(||pallavi||)
ādanim̐ gŏsaragure aṁdemunnadi
ādumalo sarivachchĕ naṁdemunnadi
(||ādani||)
sāyabāḍumām̐ṭalĕlla savisesugŏṁṭagāga
āyaḍam̐ dappuvaṭṭide aṁdemunnadi
śheyarānisem̐ta sūsi sĕlavi navvuḍagāga
āyarada diddam̐bode aṁdemunnadi
(||ādani||)
ŏlisi nŏllani valabŏḍim̐ bĕṭṭugŏṁṭagāga
aligi sŏlayam̐bode aṁdemunnadi
balimi suṭṭarigamu paim̐bŏduguḍagāga
alari vichchi sūside naṁdemunnadi
(||ādani||)
ĕgasakkelemi gallā yĕdam̐bĕṭṭugŏṁṭagāga
agaḍu śhāyam̐bode naṁdemunnadi
nigiḍi śhrī vĕṁkaḍādri nilayum̐ḍe nannum̐gūḍĕ
agabaḍḍa mīm̐da nerālaṁdemunnadi