Aadanigi nidi paraagauno kaado

ఆతనికి నిది పరాకౌనో కాదో
Language

(॥పల్లవి॥)
ఆతనికి నిది పరాకౌనో కాదో
కాతరపు భ్రమ నేఁ గాచుకున్న దానను

(॥ఆత॥)
యెప్పుడు వచ్చునో విభుఁ డేమని పలుకునో
అప్పుడు నేరరాదంటూ నేను
రెప్పవెయ్యక కన్నుల రేఁగి రేఁగి కనుగొంటాఁ
జప్పు డాలింపుచు నే నిచ్చట నున్నదానను

(॥ఆత॥)
యెదురుగఁ బోకున్న యేమని యెగ్గుపట్టునో
అదనేదో విభునికినంటా నేను
వెదచల్లుఁగూరిమితో వేఁగు దివ్వె వెట్టుకొని
నిదుర గంటికి రాక నిలుచున్నదానను

(॥ఆత॥)
యింతలోనె శ్రీవేంకటేశుఁ డిందు విచ్చేసి
యెంతకెంత నన్నుఁగూడె నిదె యంటాను
సంతసపుఁబులకల జడియుచుఁ గరఁగుచు
వింతరతుల విఱ్ఱవీఁగుచున్నదానను

(||pallavi||)
ādanigi nidi parāgauno kādo
kādarabu bhrama nem̐ gāsugunna dānanu

(||āda||)
yĕppuḍu vachchuno vibhum̐ ḍemani paluguno
appuḍu nerarādaṁṭū nenu
rĕppavĕyyaga kannula rem̐gi rem̐gi kanugŏṁṭām̐
jappu ḍāliṁpusu ne nichchaḍa nunnadānanu

(||āda||)
yĕdurugam̐ bogunna yemani yĕggubaṭṭuno
adanedo vibhuniginaṁṭā nenu
vĕdasallum̐gūrimido vem̐gu divvĕ vĕṭṭugŏni
nidura gaṁṭigi rāga nilusunnadānanu

(||āda||)
yiṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁdu vichchesi
yĕṁtagĕṁta nannum̐gūḍĕ nidĕ yaṁṭānu
saṁtasabum̐bulagala jaḍiyusum̐ garam̐gusu
viṁtaradula viṭravīm̐gusunnadānanu