(॥పల్లవి॥)
ఆతనికి నీవే వొక ఆలవైతివా
యేతలఁ జూచిన సతు లెందరైనాఁ గలరు
(॥ఆత॥)
వింతలుగా రమణుఁడు వేమారు వినీనంటా
మంతనము లేమాడేవే మాపుదాఁకాను
సంతోసాన నాతఁడు సమ్మతించి వున్నాఁడంటా
దొంతి వెట్టి వలపేల తూరుపెత్తేవే
(॥ఆత॥)
వువ్విళ్లూర నాతఁడు వొద్దికఁ జూచీనంటా
నవ్వు లేమి నవ్వేవే నడుమ నీవు
నివ్వటిల్ల నప్పటిని నీకు మేలువాఁడంటను
తవ్వి తవ్వి తమి యెంత తలకెత్తేవే
(॥ఆత॥)
శ్రీవేంకటేశుఁడు నీకు చేతిలోనివాఁడంటా
భావించి యేమి చూచేవే పలుమారును
యీవల నాతఁడే నన్ను యేలినాఁడు తొలుతనె
చేవదేరె నింకా నేమి సేసలు చల్లేవే
(||pallavi||)
ādanigi nīve vŏga ālavaidivā
yedalam̐ jūsina sadu lĕṁdarainām̐ galaru
(||āda||)
viṁtalugā ramaṇum̐ḍu vemāru vinīnaṁṭā
maṁtanamu lemāḍeve mābudām̐kānu
saṁtosāna nādam̐ḍu sammadiṁchi vunnām̐ḍaṁṭā
dŏṁti vĕṭṭi valabela tūrubĕtteve
(||āda||)
vuvviḽlūra nādam̐ḍu vŏddigam̐ jūsīnaṁṭā
navvu lemi navveve naḍuma nīvu
nivvaḍilla nappaḍini nīgu meluvām̐ḍaṁṭanu
tavvi tavvi tami yĕṁta talagĕtteve
(||āda||)
śhrīveṁkaḍeśhum̐ḍu nīgu sedilonivām̐ḍaṁṭā
bhāviṁchi yemi sūseve palumārunu
yīvala nādam̐ḍe nannu yelinām̐ḍu tŏludanĕ
sevaderĕ niṁkā nemi sesalu salleve