Aadanigi neegum dagu nannidaa nammaa

ఆతనికి నీకుఁ దగు నన్నిటా నమ్మా
Language

(॥పల్లవి॥)
ఆతనికి నీకుఁ దగు నన్నిటా నమ్మా
రాతిరిఁ బగలుఁ గాఁపురము సేయవమ్మా

(॥ఆత॥)
గొప్పైన కన్నులదాన కోడె వయసుదాన
చిప్పిలు గళలదాన సింగారిదాన
యిప్పు డల్లాతఁడు మా యేలిక నిన్నుఁ జూచి
కప్పుర విడె మంపెఁ గైకొనవమ్మా

(॥ఆత॥)
పవడపు మోవిదాన భాపు గుబ్బలదాన
సవరపుఁ గొప్పుదాన చక్కనిదాన
యివల నిదిగో నీ యెదుటనే వున్నవాఁడు
రవళ నీ వొద్ది కిట్టె రమ్మనవమ్మా

(॥ఆత॥)
తళుకుఁ జెక్కులదాన తలిరుఁ బాదాలదాన
సెలవి నవ్వులదాన సిగ్గరిదాన
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
మెలుపున నినుఁ గూడె మెచ్చఁగదవమ్మా

(||pallavi||)
ādanigi nīgum̐ dagu nanniḍā nammā
rādirim̐ bagalum̐ gām̐puramu seyavammā

(||āda||)
gŏppaina kannuladāna koḍĕ vayasudāna
sippilu gaḽaladāna siṁgāridāna
yippu ḍallādam̐ḍu mā yeliga ninnum̐ jūsi
kappura viḍĕ maṁpĕm̐ gaigŏnavammā

(||āda||)
pavaḍabu movidāna bhābu gubbaladāna
savarabum̐ gŏppudāna sakkanidāna
yivala nidigo nī yĕduḍane vunnavām̐ḍu
ravaḽa nī vŏddi kiṭṭĕ rammanavammā

(||āda||)
taḽugum̐ jĕkkuladāna talirum̐ bādāladāna
sĕlavi navvuladāna siggaridāna
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
mĕlubuna ninum̐ gūḍĕ mĕchcham̐gadavammā