Aadanigi neegum bomdulauda neneṟamgane

ఆతనికి నీకుఁ బొందులౌత నేనెఱఁగనే
Language

(॥పల్లవి॥)
ఆతనికి నీకుఁ బొందులౌత నేనెఱఁగనే
నీతితోఁ జెలుల లాగు నేఁడు గంటినే

(॥॥)
యెగసక్కేలకు విభుఁడిటువలెఁ జేయఁగాను
తగవు లేమిచెప్పేవే తరుణి నీవు
మగవాఁడంటా నేఁడు మరి వొలపక్షాలాడి
మగువలతోనేల మాయలుసేసేవే

(॥॥)
కడునొడ్డారా లాడకు కాంతుఁడు నవ్వఁగా నన్ను
వొడఁబరచేవదేమే వువిద నీవు
అడరి రమణుఁడంటా నాతనివంకలు దిద్ది
పడఁతుల నింతయేల భ్రమలఁబెట్టేవే

(॥॥)
చలాలకు శ్రీ వేంకటేశ్వరుఁడే నన్నుఁగూడఁగా
అలుక లెంత దీర్చేవే అంగన నీవు
బలువుఁడంటా నతనిఁ బాలార్చే వలమేల్మంగ
చెలులమంటానేల సిగ్గులు రేఁచేవే

(||pallavi||)
ādanigi nīgum̐ bŏṁdulauda nenĕṟam̐gane
nīdidom̐ jĕlula lāgu nem̐ḍu gaṁṭine

(||||)
yĕgasakkelagu vibhum̐ḍiḍuvalĕm̐ jeyam̐gānu
tagavu lemisĕppeve taruṇi nīvu
magavām̐ḍaṁṭā nem̐ḍu mari vŏlabakṣhālāḍi
maguvaladonela māyaluseseve

(||||)
kaḍunŏḍḍārā lāḍagu kāṁtum̐ḍu navvam̐gā nannu
vŏḍam̐barasevademe vuvida nīvu
aḍari ramaṇum̐ḍaṁṭā nādanivaṁkalu diddi
paḍam̐tula niṁtayela bhramalam̐bĕṭṭeve

(||||)
salālagu śhrī veṁkaḍeśhvarum̐ḍe nannum̐gūḍam̐gā
aluga lĕṁta dīrseve aṁgana nīvu
baluvum̐ḍaṁṭā nadanim̐ bālārse valamelmaṁga
sĕlulamaṁṭānela siggulu rem̐seve