ఆతనికి నీకు నింపులై యుండఁగా
(॥పల్లవి॥)
ఆతనికి నీకు నింపులై యుండఁగా
యీతలాతలివారి కెంచఁగనేమిటికి
(॥ఆత॥)
మగఁడుమన్నించేదానిమాటలెల్లాఁ జక్కనే
తగవరివనితపంతము చక్కన
నగనేరిచినదానినటనలెల్లా జక్కన
యెగసకెములాడఁగ యెవ్వరికేమిటికి
(॥ఆత॥)
సిరిగలిగినదానిచేఁతలెల్లాఁ జక్కనే
పొరుగుపోరచికాంతపొందు చక్కన
సరినిచ్చకపుదానిసరసములు చక్కన
దొరకొని యెవ్వరికి దూరఁగనేమిటికే
(॥ఆత॥)
పాయము గలుగు దాని పగటులెల్లాఁ జక్కనే
చాయయెఱిఁగినసతిజాడ చక్కన
యీయెడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
పాయక నన్నేలె తాము పచ్చార నేమిటికే
(||pallavi||)
ādanigi nīgu niṁpulai yuṁḍam̐gā
yīdalādalivāri kĕṁcham̐ganemiḍigi
(||āda||)
magam̐ḍumanniṁchedānimāḍalĕllām̐ jakkane
tagavarivanidabaṁtamu sakkana
naganerisinadāninaḍanalĕllā jakkana
yĕgasagĕmulāḍam̐ga yĕvvarigemiḍigi
(||āda||)
sirigaliginadānisem̐talĕllām̐ jakkane
pŏruguborasigāṁtabŏṁdu sakkana
sarinichchagabudānisarasamulu sakkana
dŏragŏni yĕvvarigi dūram̐ganemiḍige
(||āda||)
pāyamu galugu dāni pagaḍulĕllām̐ jakkane
sāyayĕṟim̐ginasadijāḍa sakkana
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
pāyaga nannelĕ tāmu pachchāra nemiḍige