Aadanigi neege tagu namduge pove

ఆతనికి నీకే తగు నందుకే పోవే
Language

(॥పల్లవి॥)
ఆతనికి నీకే తగు నందుకే పోవే
యీతల నే మిందుకెల్లా నిట్టే తలవంతుమే

(॥॥)
సటలివి మాకైతే సగియించ వింకాను
నటన నాతనితోనే నవ్వవే పోయి
యిటువలెఁ జేసి మాయింటికి వచ్చే వప్పటి
కటకటా నేమైతే కడుసిగ్గు విడమే

(॥॥)
చెంగలు నీమాట వింటే చిమ్మిరేఁగీ మేనెల్లా
అంగడి నాతనితోడ నాడవే పోయి
వెంగలితనాన నాకే విడెమియ్య వచ్చేవు
యింగితాన నేమైతే నింతరొచ్చు కోపమే

(॥॥)
నిలువెల్లాఁ గాఁకరేఁగీ నిన్నుఁజూచితే నాకు
వొలిసి నీపతివద్ద నుండవే పోయి
యెలమి శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
వలచి నే మిందుకెల్లా వాసిదెచ్చుకొందుమే

(||pallavi||)
ādanigi nīge tagu naṁduge pove
yīdala ne miṁdugĕllā niṭṭe talavaṁtume

(||||)
saḍalivi māgaide sagiyiṁcha viṁkānu
naḍana nādanidone navvave poyi
yiḍuvalĕm̐ jesi māyiṁṭigi vachche vappaḍi
kaḍagaḍā nemaide kaḍusiggu viḍame

(||||)
sĕṁgalu nīmāḍa viṁṭe simmirem̐gī menĕllā
aṁgaḍi nādanidoḍa nāḍave poyi
vĕṁgalidanāna nāge viḍĕmiyya vachchevu
yiṁgidāna nemaide niṁtarŏchchu kobame

(||||)
niluvĕllām̐ gām̐karem̐gī ninnum̐jūside nāgu
vŏlisi nībadivadda nuṁḍave poyi
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
valasi ne miṁdugĕllā vāsidĕchchugŏṁdume