Aadanigi lonaide nauduvu gaaga

ఆతనికి లోనైతే నౌదువు గాక
Language

(॥పల్లవి॥)
ఆతనికి లోనైతే నౌదువు గాక
ఆతుమైన చెలిమి నన్నంత సేయవలెనా

(॥ఆత॥)
పలుమారు మాటాడించ పంతమా నాతోను
తలవంచుకుండేదాని తమకానను
యెలమి నాతనికే యెత్తియ్యవే మాఁటలు
కలఁగి వుండినవేళ గాసిఁబెట్టవలెనా

(॥ఆత॥)
సారె నన్ను నవ్వించ చలమా నాతోను
వూరకే చింతించేదాని వుల్లసానను
కేరుఁగాని ఆతనినే గిలిగించవే నీవు
వూరకే వుండినదాని నుడికించ వలెనా

(॥ఆత॥)
చేవట్టి కాఁగిలింపించ చెలిమా నాతోను
వోవరిలో నున్నదాని వొద్దికిఁ దీసి
శ్రీ వేంకటేశుఁడు గూడె చిమ్మిరేఁచవే యతని
కైవశమై వున్నదాని కదుమఁగ వలెనా

(||pallavi||)
ādanigi lonaide nauduvu gāga
ādumaina sĕlimi nannaṁta seyavalĕnā

(||āda||)
palumāru māḍāḍiṁcha paṁtamā nādonu
talavaṁchuguṁḍedāni tamagānanu
yĕlami nādanige yĕttiyyave mām̐ṭalu
kalam̐gi vuṁḍinaveḽa gāsim̐bĕṭṭavalĕnā

(||āda||)
sārĕ nannu navviṁcha salamā nādonu
vūrage siṁtiṁchedāni vullasānanu
kerum̐gāni ādanine giligiṁchave nīvu
vūrage vuṁḍinadāni nuḍigiṁcha valĕnā

(||āda||)
sevaṭṭi kām̐giliṁpiṁcha sĕlimā nādonu
vovarilo nunnadāni vŏddigim̐ dīsi
śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ simmirem̐save yadani
kaivaśhamai vunnadāni kadumam̐ga valĕnā