ఆతనికే వలతు నే నన్నింటాను
(॥పల్లవి॥)
ఆతనికే వలతు నే నన్నింటాను
కాతరాన నిందుకే నేఁ గాచుకవుందానను
(॥ఆత॥)
విన నవధరించెనా విభుఁడు నీవిన్నపము
మనసురంజిలి నీతో మాటలాడెనా
నవిచి నీచేకానుక నంటున నందుకొనెనా
వినవేడుకయ్యీ నాకు వెలఁది చెప్పఁగదే
(॥అత॥)
అడిగెనా నిన్నాతఁ డట్టె నాపరిణామము
కడుసంతోసాన నిన్ను గారవించెనా
కడఁగి నేనంపినలేకలు చదువుకొనెనా
జడియ కాతలఁపులు చక్కఁగాఁ దెలుపవే
(॥అత॥)
నీవెంటనే వచ్చెనా నెమ్మి శ్రీవేంకటేశుఁడు
యీవేళఁ జనవిచ్చెనా యింతలో నాకు
కైవసమై నన్నునేలె కప్పురపుటింటిలోన
తావుకొన్నభావములు తగ నెఱిఁగించవే
(||pallavi||)
ādanige valadu ne nanniṁṭānu
kādarāna niṁduge nem̐ gāsugavuṁdānanu
(||āda||)
vina navadhariṁchĕnā vibhum̐ḍu nīvinnabamu
manasuraṁjili nīdo māḍalāḍĕnā
navisi nīsegānuga naṁṭuna naṁdugŏnĕnā
vinaveḍugayyī nāgu vĕlam̐di sĕppam̐gade
(||ada||)
aḍigĕnā ninnādam̐ ḍaṭṭĕ nābariṇāmamu
kaḍusaṁtosāna ninnu gāraviṁchĕnā
kaḍam̐gi nenaṁpinalegalu saduvugŏnĕnā
jaḍiya kādalam̐pulu sakkam̐gām̐ dĕlubave
(||ada||)
nīvĕṁṭane vachchĕnā nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍu
yīveḽam̐ janavichchĕnā yiṁtalo nāgu
kaivasamai nannunelĕ kappurabuḍiṁṭilona
tāvugŏnnabhāvamulu taga nĕṟim̐giṁchave