Aadanigamte jaanavavuduve neevu

ఆతనికంటే జాణవవుదువే నీవు
Language

(॥పల్లవి॥)
ఆతనికంటే జాణవవుదువే నీవు
చేతికి లోనుచేసుక సిగ్గులువడేవు

(॥ఆత॥)
మచ్చిక నాతఁడు నీమనసు చూడవలసి
నెచ్చెలియొకతెవంక నిక్కిచూచెను
అచ్చలాన నీవంతలో నాతనికన్నులు మూసి
పెచ్చు పెరుగుచు నీపేరు చెప్పుమనేవు

(॥ఆత॥)
రంతులనీపతి నిన్ను రాఁపులు సేయవలసి
చెంతల వేరొకతేకు చేయిచాఁచెను
పంతాన నీవంతలోనే బాగాలు చేతికిచ్చి
వింతలుగ దోమతెర వేసేవు నీవు

(॥ఆత॥)
శ్రీ వేంకటేశుఁడు నీచే చెనకించుకోవలసి
పూవుల నొకతెమీఁద పూఁచివేసెను
ఆవల నీవంతలోనే యడ్డము వచ్చి నిలిచి
కైవసము చేసుకొని కాఁగిలించుకొంటివి

(||pallavi||)
ādanigaṁṭe jāṇavavuduve nīvu
sedigi lonusesuga sigguluvaḍevu

(||āda||)
machchiga nādam̐ḍu nīmanasu sūḍavalasi
nĕchchĕliyŏgadĕvaṁka nikkisūsĕnu
achchalāna nīvaṁtalo nādanigannulu mūsi
pĕchchu pĕrugusu nīberu sĕppumanevu

(||āda||)
raṁtulanībadi ninnu rām̐pulu seyavalasi
sĕṁtala verŏgadegu seyisām̐sĕnu
paṁtāna nīvaṁtalone bāgālu sedigichchi
viṁtaluga domadĕra vesevu nīvu

(||āda||)
śhrī veṁkaḍeśhum̐ḍu nīse sĕnagiṁchugovalasi
pūvula nŏgadĕmīm̐da pūm̐sivesĕnu
āvala nīvaṁtalone yaḍḍamu vachchi nilisi
kaivasamu sesugŏni kām̐giliṁchugŏṁṭivi