(॥పల్లవి॥)
ఆతనితో నీమాటే అనరే మీరు
చేతికి లోనైనమీఁదఁ జెప్పేఁ గాని
(॥ఆతని॥)
తప్పక చూచినచూపు తగులనాడినమాట
యెప్పుడుఁ బాయదు నాయెదలోనను
కప్పురమే అంపెఁ గాని కటకట యింతసేసి
యిప్పుడు యీవేళనైన యేల రాఁడే తాను
(॥ఆతని॥)
కన్నుల మొక్కినమొక్కు గక్కనఁ జూపిన సన్న
యెన్నుకొంటి నాలోనే యిందాఁకాను
మన్ననలే మించెఁ గాని మాటలాడఁ బొద్దు లేదు
యిన్నిటాఁ దా నేరుపరి యేమనీనే తాను
(॥ఆతని॥)
కొంగువట్టి తీసినది కొనగోరు మోసినది
సంగతాయనిందరిలో సారెసారెకు
ఇంగితమెరిఁగి కూడెనిదె శ్రీవేంకటేశుఁడు
వుంగిటి నేనేమన్నా నోరుచుకొమ్మనవే
(||pallavi||)
ādanido nīmāḍe anare mīru
sedigi lonainamīm̐dam̐ jĕppem̐ gāni
(||ādani||)
tappaga sūsinasūbu tagulanāḍinamāḍa
yĕppuḍum̐ bāyadu nāyĕdalonanu
kappurame aṁpĕm̐ gāni kaḍagaḍa yiṁtasesi
yippuḍu yīveḽanaina yela rām̐ḍe tānu
(||ādani||)
kannula mŏkkinamŏkku gakkanam̐ jūbina sanna
yĕnnugŏṁṭi nālone yiṁdām̐kānu
mannanale miṁchĕm̐ gāni māḍalāḍam̐ bŏddu ledu
yinniḍām̐ dā nerubari yemanīne tānu
(||ādani||)
kŏṁguvaṭṭi tīsinadi kŏnagoru mosinadi
saṁgadāyaniṁdarilo sārĕsārĕgu
iṁgidamĕrim̐gi kūḍĕnidĕ śhrīveṁkaḍeśhum̐ḍu
vuṁgiḍi nenemannā norusugŏmmanave