ఆతనిపై పరాకే అతివకు ఘనమాయె
(॥పల్లవి॥)
ఆతనిపై పరాకే అతివకు ఘనమాయె
చేతుల నాకెకు సన్న సేయరే చెలులూ
(॥ఆత॥)
తూఁగుమంచముపై నుండి తొయ్యలి పతిరాకకు
కాఁగిన తమకముతో గక్కన లేచె
వేఁగుగుఁ దురుము జారి విరు లొక్కొక్కటే రాలి
మూఁగీఁ దుమ్మిదలు చక్క ముడువరే చెలులు
(॥ఆత॥)
అంగన ఉయ్యోలమీఁదఁ నంతలో నాతనిఁ బెట్టి
బంగారుచేరులు చేతఁ బట్టి వూఁచీని
జంగాళమై చేలదూఁగి జడిగొనీఁ జెమటలు
చెంగట నెచ్చరికగాఁ జెప్పరే చెలులు
(॥ఆత॥)
శ్రీవేంకటేశ్వరుఁడే చేయి వట్టి తీసుకోఁగా
కైవసమై యాతనిసంగడిఁ గూచుండె
భావము లొక్కటే యాయెఁ బతికిని సతికిని
యీవేళ వాకిట నుంద మిటు రారే చెలులు
(||pallavi||)
ādanibai parāge adivagu ghanamāyĕ
sedula nāgĕgu sanna seyare sĕlulū
(||āda||)
tūm̐gumaṁchamubai nuṁḍi tŏyyali padirāgagu
kām̐gina tamagamudo gakkana lesĕ
vem̐gugum̐ durumu jāri viru lŏkkŏkkaḍe rāli
mūm̐gīm̐ dummidalu sakka muḍuvare sĕlulu
(||āda||)
aṁgana uyyolamīm̐dam̐ naṁtalo nādanim̐ bĕṭṭi
baṁgāruserulu sedam̐ baṭṭi vūm̐sīni
jaṁgāḽamai seladūm̐gi jaḍigŏnīm̐ jĕmaḍalu
sĕṁgaḍa nĕchcharigagām̐ jĕppare sĕlulu
(||āda||)
śhrīveṁkaḍeśhvarum̐ḍe seyi vaṭṭi tīsugom̐gā
kaivasamai yādanisaṁgaḍim̐ gūsuṁḍĕ
bhāvamu lŏkkaḍe yāyĕm̐ badigini sadigini
yīveḽa vāgiḍa nuṁda miḍu rāre sĕlulu