Aadani sittamu maṟi yatte naa bhaagyamu

ఆతని చిత్తము మఱి యట్టే నా భాగ్యము
Language

(॥పల్లవి॥)
ఆతని చిత్తము మఱి యట్టే నా భాగ్యము
నాతులాల పతికి విన్నప మిట్టే సేయరే

(॥॥)
చిగురు మోవి మీఁదఁ జిప్పిలఁగాఁ దేనెలు
వొగరు మాటలాడ నొనగూడునా
మొగమోటములు నాకు ముంచుకోఁగాఁ బతితోను
తగవులు పచరించఁ దలకూడునా

(॥॥)
కన్నుల నాతనిఁ జూచే కాంక్షలు నిండుండఁ గాను
సన్న బొమ్మజం కెనలు సమకూడునా
చిన్ని సెలవుల నాకు చిఱునవ్వులు రాఁగాను
కన్నెనైన నాకు నలుకలు నేఁడు దగునా

(॥॥)
పక్కనఁ జన్నులమీఁ ది పయ్యద జారఁగాను
యెక్కడ లేని సిగ్గు లింక వచ్చునా
గక్కనను శ్రీ వేంకటేశుఁ డు నన్నుఁగూడె
తక్కించి తప్పు లెంచఁ దలకూడునా

(||pallavi||)
ādani sittamu maṟi yaṭṭe nā bhāgyamu
nādulāla padigi vinnaba miṭṭe seyare

(||||)
siguru movi mīm̐dam̐ jippilam̐gām̐ denĕlu
vŏgaru māḍalāḍa nŏnagūḍunā
mŏgamoḍamulu nāgu muṁchugom̐gām̐ badidonu
tagavulu pasariṁcham̐ dalagūḍunā

(||||)
kannula nādanim̐ jūse kāṁkṣhalu niṁḍuṁḍam̐ gānu
sanna bŏmmajaṁ kĕnalu samagūḍunā
sinni sĕlavula nāgu siṟunavvulu rām̐gānu
kannĕnaina nāgu nalugalu nem̐ḍu dagunā

(||||)
pakkanam̐ jannulamīm̐ di payyada jāram̐gānu
yĕkkaḍa leni siggu liṁka vachchunā
gakkananu śhrī veṁkaḍeśhum̐ ḍu nannum̐gūḍĕ
takkiṁchi tappu lĕṁcham̐ dalagūḍunā