Aadani sitta meṟimgee ani vinnavimchave

ఆతని చిత్త మెఱిఁగీ అని విన్నవించవే
Language

(॥పల్లవి॥)
ఆతని చిత్త మెఱిఁగీ అని విన్నవించవే
కాతరించి కొసరితే కడుఁ జవు లౌనా

(॥ఆతని॥)
చనవుగలపాటినే సరలమాడుత గాక
వినవే వెగ్గళమైతే వెగటు గాదా
మనసువచ్చినరీతి మచ్చికె చల్లుత గాక
ననచని సుద్దు లెల్లా నగుఁబాటు గాదా

(॥ఆతని॥)
తగవు నడపితేనే తడవుటా మేలు గాక
అగడైతే వలపు వాయకు వచ్చునా
మొగము చూచితేను మొక్కఁగ నమరుఁ గాక
నొగియనిచోటను చోట్లు వెదకుదురా

(॥ఆతని॥)
కమ్మి చేతికి లోనైతే కౌఁగిలించుకొంట గాక
వుమ్మడి నూరకుండితే వొగరు గాదా
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డే నలమేల్మంగను
సమ్మతించ నన్ను నేలే సాదించవచ్చును

(||pallavi||)
ādani sitta mĕṟim̐gī ani vinnaviṁchave
kādariṁchi kŏsaride kaḍum̐ javu launā

(||ādani||)
sanavugalabāḍine saralamāḍuda gāga
vinave vĕggaḽamaide vĕgaḍu gādā
manasuvachchinarīdi machchigĕ salluda gāga
nanasani suddu lĕllā nagum̐bāḍu gādā

(||ādani||)
tagavu naḍabidene taḍavuḍā melu gāga
agaḍaide valabu vāyagu vachchunā
mŏgamu sūsidenu mŏkkam̐ga namarum̐ gāga
nŏgiyanisoḍanu soṭlu vĕdagudurā

(||ādani||)
kammi sedigi lonaide kaum̐giliṁchugŏṁṭa gāga
vummaḍi nūraguṁḍide vŏgaru gādā
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelmaṁganu
sammadiṁcha nannu nele sādiṁchavachchunu