(॥పల్లవి॥)
ఆతని చెలిని నా కేమనరాదు
కాతరించ నేఁటికి నుంగరమందుకొనవే
(॥ఆతని॥)
సిగ్గువడ నేమిటికి చెలువుఁడు కాఁగిలించె
వొగ్గి యింక నాతనితో నొనగూడవే
నిగ్గుల నామోము చూచి నీవేల నవ్వేవే
వెగ్గళించకాతఁడిచ్చే వీడెమందుకొనవే
(॥ఆతని॥)
పల్లదము లేమిటికే పచ్చడము గప్పెఁ బతి
చల్లఁగాఁ జెప్పినట్ల సమ్మతించవే
వొల్లనె నాకొంగువట్టి వొద్దికేల తీసేవు
బల్లిదుఁడాతని నిమ్మపండందుకొనవే
(॥ఆతని॥)
శిరసు వంచనేఁటికి శ్రీవేంకటేశుఁడు గూడె
తెరవేసుకొనె లోలోఁ దిరముగావే
గరిమ నలమేలుమంగవు నన్నెంత మెచ్చేవు
పొరిఁబొరి నాతని పువ్వులందుకొనవే
(||pallavi||)
ādani sĕlini nā kemanarādu
kādariṁcha nem̐ṭigi nuṁgaramaṁdugŏnave
(||ādani||)
sigguvaḍa nemiḍigi sĕluvum̐ḍu kām̐giliṁchĕ
vŏggi yiṁka nādanido nŏnagūḍave
niggula nāmomu sūsi nīvela navveve
vĕggaḽiṁchagādam̐ḍichche vīḍĕmaṁdugŏnave
(||ādani||)
palladamu lemiḍige pachchaḍamu gappĕm̐ badi
sallam̐gām̐ jĕppinaṭla sammadiṁchave
vŏllanĕ nāgŏṁguvaṭṭi vŏddigela tīsevu
ballidum̐ḍādani nimmabaṁḍaṁdugŏnave
(||ādani||)
śhirasu vaṁchanem̐ṭigi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
tĕravesugŏnĕ lolom̐ diramugāve
garima nalamelumaṁgavu nannĕṁta mĕchchevu
pŏrim̐bŏri nādani puvvulaṁdugŏnave