ఆతని నిక్కడికే రమ్మనే మమ్మా
(॥పల్లవి॥)
ఆతని నిక్కడికే రమ్మనే మమ్మా
యేతులకు మరేమన్నా నెఱఁగ మమ్మా
(॥॥)
కన్నెరో విరహముతో కాంతునింటి కేఁగె నంటా
యెన్నుకొని యిల్లు వెళ్ళి యేఁగకు వమ్మా
వెన్నెల యెండలు దాఁ కి వేసవి యెంత సేసునో
యిన్నేసి సాహసాలకు నెఱఁగ మమ్మా
(॥॥)
ఆతఁడురానికాఁకలు ఆఁపలేక వొకతెవె
యీతల వనములోని కేఁగకు వమ్మా
పోతరించి కోవిలల భూతము లందుఁ గలవు
యీ తలఁపు దలఁచేవు యెఱఁగ మమ్మా
(॥॥)
అలమేల్మంగ శ్రీ వేంకటప్ప డిట్టే నిన్నుఁ గూడె
యెలమి మేడమీఁదికి నేఁగకు వమ్మా
చిలుకలు మీ చేఁతలు సిగ్గులు దోఁచఁగ నాడీ
ఇలమీఁద నింత కాఁకు యెఱఁగ మమ్మా.
(||pallavi||)
ādani nikkaḍige rammane mammā
yedulagu maremannā nĕṟam̐ga mammā
(||||)
kannĕro virahamudo kāṁtuniṁṭi kem̐gĕ naṁṭā
yĕnnugŏni yillu vĕḽḽi yem̐gagu vammā
vĕnnĕla yĕṁḍalu dām̐ ki vesavi yĕṁta sesuno
yinnesi sāhasālagu nĕṟam̐ga mammā
(||||)
ādam̐ḍurānigām̐kalu ām̐palega vŏgadĕvĕ
yīdala vanamuloni kem̐gagu vammā
podariṁchi kovilala bhūdamu laṁdum̐ galavu
yī talam̐pu dalam̐sevu yĕṟam̐ga mammā
(||||)
alamelmaṁga śhrī veṁkaḍappa ḍiṭṭe ninnum̐ gūḍĕ
yĕlami meḍamīm̐digi nem̐gagu vammā
silugalu mī sem̐talu siggulu dom̐sam̐ga nāḍī
ilamīm̐da niṁta kām̐ku yĕṟam̐ga mammā.