ఆతని నేల సాదించే వప్పుడే నీవు
(॥పల్లవి॥)
ఆతని నేల సాదించే వప్పుడే నీవు
మాతోడిదానవా మగువరో నీవు
(॥ఆత॥)
వాసితోడఁ బెనఁగేటివలపు లీడేరుఁ గాక
వేసరి అలుగఁబోతే వేడుక లౌనా
సేసతోఁ బెండ్లాడినదే చెల్లుబళ్లౌఁ గాక
పూసుగోఁడై అంటుకొన్న పొందులు నిజమౌనా
(॥ఆత॥)
చేకొలఁది మెలఁగితే చేఁతలెల్లఁ జెల్లుఁగాక
దీకొని బలిమి సేసితే మెచ్చౌనా
యేకడా మంచిగుణాలే యెన్నికకు నెక్కుఁగాక
కాకరి విద్యలకకు లోకమువారు మెత్తురా
(॥ఆత॥)
పాయకున్న కూటమికి బావము గరఁగుఁ గాక
చాయపాటు చెనకులు చవు లయ్యీనా
యీ యడ శ్రీ వేంకటేశుఁడేలె నన్ను నీ వనిత
నాయీడుకుఁ గూడితివి ననువయ్యీనా
(||pallavi||)
ādani nela sādiṁche vappuḍe nīvu
mādoḍidānavā maguvaro nīvu
(||āda||)
vāsidoḍam̐ bĕnam̐geḍivalabu līḍerum̐ gāga
vesari alugam̐bode veḍuga launā
sesadom̐ bĕṁḍlāḍinade sĕllubaḽlaum̐ gāga
pūsugom̐ḍai aṁṭugŏnna pŏṁdulu nijamaunā
(||āda||)
segŏlam̐di mĕlam̐gide sem̐talĕllam̐ jĕllum̐gāga
dīgŏni balimi seside mĕchchaunā
yegaḍā maṁchiguṇāle yĕnnigagu nĕkkum̐gāga
kāgari vidyalagagu logamuvāru mĕtturā
(||āda||)
pāyagunna kūḍamigi bāvamu garam̐gum̐ gāga
sāyabāḍu sĕnagulu savu layyīnā
yī yaḍa śhrī veṁkaḍeśhum̐ḍelĕ nannu nī vanida
nāyīḍugum̐ gūḍidivi nanuvayyīnā