ఆతని నేల దూరేవే అప్పటి నీవు
(॥పల్లవి॥)
ఆతని నేల దూరేవే అప్పటి నీవు
నీతులు చెప్పఁబోయిన నెరుసులే యెంతురు
(॥ఆత॥)
వొరులఁ దడవకున్న వొచ్చము లేక వుండిన
సరుఁస బలుకుదురు సవతివారు
పురుషుఁ డందుకుఁగాను పూనుక తా వచ్చినాను
వెరవు దెలియుదాఁకా వెండేలే యాడుదురు
(॥ఆత॥)
తమఇంటనే వుండన తగవుతో నడచిన
జమళినే సాదింతురు సంగడివారు
రమణుఁ డందుకుఁగాను రాఁపుగా నడ్డమాడిన
అమరని కాఁకతోడ నగ్గల మాడుదురు
(॥ఆత॥)
ఇచ్చకమే సేసినాను యెరవు లేకుండినాను
వచ్చివచ్చి మీరుదురు వంతులవారు
నిచ్చ శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ బాయకిట్లుండె
విచ్చనవిడి నాతని వేవేలు నాడుదురు
(||pallavi||)
ādani nela dūreve appaḍi nīvu
nīdulu sĕppam̐boyina nĕrusule yĕṁturu
(||āda||)
vŏrulam̐ daḍavagunna vŏchchamu lega vuṁḍina
sarum̐sa baluguduru savadivāru
puruṣhum̐ ḍaṁdugum̐gānu pūnuga tā vachchinānu
vĕravu dĕliyudām̐kā vĕṁḍele yāḍuduru
(||āda||)
tama̮iṁṭane vuṁḍana tagavudo naḍasina
jamaḽine sādiṁturu saṁgaḍivāru
ramaṇum̐ ḍaṁdugum̐gānu rām̐pugā naḍḍamāḍina
amarani kām̐kadoḍa naggala māḍuduru
(||āda||)
ichchagame sesinānu yĕravu leguṁḍinānu
vachchivachchi mīruduru vaṁtulavāru
nichcha śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ bāyagiṭluṁḍĕ
vichchanaviḍi nādani vevelu nāḍuduru