ఆతని నీవేమైనా నంటివా తొల్లి
(॥పల్లవి॥)
ఆతని నీవేమైనా నంటివా తొల్లి
నీ తమి తానె యెరుఁగు నీకేలే వెరపు
(॥అతని॥)
మొగము చూచె నతఁడు మొక్కిలి వందుకు నీ
తగ వాతఁ డెఱఁగడా దాని కేమి
పగ యిద్దరికి లేదు సంతాన నుండితి వింతే
నిగిడి యిందుకుఁ గామ నీ కేలే వెరవ
(॥అతని॥)
తామెర వేసె నతఁడు తట్టితివి చేత నీవు
దోమటి దోడికేవేళ దోసమా యేమి
యేమిటాను మోసపోరు యిద్దరికి కిద్దరే సాటి
నేమ మేమిటాఁ దప్పదు నీ కేలే వెరవ
(॥అతని॥)
చేత నిన్ను నంటఁగాను సిరసు వంచితి వింతే
ఆతఁడె శ్రీవెంకటేశుఁ డందు కేమి
యేతులకుఁ గూడితిరి యిద్దరు నిక్కడనే
నీతితో బదుక వమ్మ నీ కేల వెరవ
(||pallavi||)
ādani nīvemainā naṁṭivā tŏlli
nī tami tānĕ yĕrum̐gu nīgele vĕrabu
(||adani||)
mŏgamu sūsĕ nadam̐ḍu mŏkkili vaṁdugu nī
taga vādam̐ ḍĕṟam̐gaḍā dāni kemi
paga yiddarigi ledu saṁtāna nuṁḍidi viṁte
nigiḍi yiṁdugum̐ gāma nī kele vĕrava
(||adani||)
tāmĕra vesĕ nadam̐ḍu taṭṭidivi seda nīvu
domaḍi doḍigeveḽa dosamā yemi
yemiḍānu mosaboru yiddarigi kiddare sāḍi
nema memiḍām̐ dappadu nī kele vĕrava
(||adani||)
seda ninnu naṁṭam̐gānu sirasu vaṁchidi viṁte
ādam̐ḍĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍaṁdu kemi
yedulagum̐ gūḍidiri yiddaru nikkaḍane
nīdido baduga vamma nī kela vĕrava