Aadani nannu nannatte yanaraadaa

ఆతని నన్ను నన్నట్టే యనరాదా
Language

(॥పల్లవి॥)
ఆతని నన్ను నన్నట్టే యనరాదా
తోతో వలపక్షము దోము గాదా

(॥ఆతని॥)
ఉప్పటించి యాతఁడు నన్నొకటోకటె యాఁడగా
అప్పటి నన్నే కోపించే వవునే నీవు
రెప్పుచూపుల వాఁడే రేసులు పుట్టించఁగాను
చెప్పేవు నాకే బుద్ది చెల్లునా నీకు

(॥ఆతని॥)
చలము సాదించి వాఁడే చెంతకు వచ్చి యుండఁగా
తలవంచుకొమ్మనేవు తగునేనీవు
మలసి నవ్వులు నవ్వి మన నుడికించఁగాను
కలయు మనేవు నన్ను కటకటా నీవు

(॥ఆతని॥)
వింతవానలతోడ వీఁడె వద్దఁ గూచుండఁగా
యెంతయినా నలుగనీవు యేమే నీవు
పంతపు శ్రీవేంకటాద్రిపతి నన్నుఁ గూడ గాను
కొంత వెఱఁ గంద నీవు గొణఁగ నేలే నీకు

(||pallavi||)
ādani nannu nannaṭṭe yanarādā
todo valabakṣhamu domu gādā

(||ādani||)
uppaḍiṁchi yādam̐ḍu nannŏgaḍogaḍĕ yām̐ḍagā
appaḍi nanne kobiṁche vavune nīvu
rĕppusūbula vām̐ḍe resulu puṭṭiṁcham̐gānu
sĕppevu nāge buddi sĕllunā nīgu

(||ādani||)
salamu sādiṁchi vām̐ḍe sĕṁtagu vachchi yuṁḍam̐gā
talavaṁchugŏmmanevu tagunenīvu
malasi navvulu navvi mana nuḍigiṁcham̐gānu
kalayu manevu nannu kaḍagaḍā nīvu

(||ādani||)
viṁtavānaladoḍa vīm̐ḍĕ vaddam̐ gūsuṁḍam̐gā
yĕṁtayinā naluganīvu yeme nīvu
paṁtabu śhrīveṁkaḍādribadi nannum̐ gūḍa gānu
kŏṁta vĕṟam̐ gaṁda nīvu gŏṇam̐ga nele nīgu