ఆతని మంచితనము అట్టే నా మంకుఁదనము
(॥పల్లవి॥)
ఆతని మంచితనము అట్టే నా మంకుఁదనము
ఘాతల నే నెంచుకొంటేఁ గరఁగీ నామనసు
(॥ఆతని॥)
యింటివాకిటఁ దా నుండి యిట్టె నన్నుఁ బిలువఁగ
అంటఁ గాక వున్నదాన ననిపించితి
బంటువలెఁ దా వాకిటఁ బవళించి వుండఁగాను
మంటమారితనమున మాటలాడ నైతిని
(॥ఆతని॥)
పానుపుమీఁదికి వచ్చి పైఁ జేయి వేసితేను
ఆన వెట్టి నిద్ర వచ్చీ నని తోసితి
దానికిఁ గోపించుకోక తతి గాచు కుండఁగాను
లేనగవుతోఁ గొంత లేచి మొక్క నైతిని
(॥ఆతని॥)
బలిమి శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడఁ గాను
మెలుపున నాచేయి మీఁదు సేసితి
అలమేలుమంగ నేను ఆతఁడే నన్ను మెచ్చఁగా
కిలకిల నవ్వుకొంటా కిన్నెర మీఁటితిని
(||pallavi||)
ādani maṁchidanamu aṭṭe nā maṁkum̐danamu
ghādala ne nĕṁchugŏṁṭem̐ garam̐gī nāmanasu
(||ādani||)
yiṁṭivāgiḍam̐ dā nuṁḍi yiṭṭĕ nannum̐ biluvam̐ga
aṁṭam̐ gāga vunnadāna nanibiṁchidi
baṁṭuvalĕm̐ dā vāgiḍam̐ bavaḽiṁchi vuṁḍam̐gānu
maṁṭamāridanamuna māḍalāḍa naidini
(||ādani||)
pānubumīm̐digi vachchi paim̐ jeyi vesidenu
āna vĕṭṭi nidra vachchī nani tosidi
dānigim̐ gobiṁchugoga tadi gāsu kuṁḍam̐gānu
lenagavudom̐ gŏṁta lesi mŏkka naidini
(||ādani||)
balimi śhrīvĕṁkaḍādribadi nannum̐ gūḍam̐ gānu
mĕlubuna nāseyi mīm̐du sesidi
alamelumaṁga nenu ādam̐ḍe nannu mĕchcham̐gā
kilagila navvugŏṁṭā kinnĕra mīm̐ṭidini