Aadani mahimo naadi amta mettani manaso

ఆతని మహిమో నాది అంత మెత్తని మనసో
Language

(॥పల్లవి॥)
ఆతని మహిమో నాది అంత మెత్తని మనసో
యేతులు నెమ్మెలు మీతో నేమి చెప్పేనే

(॥ఆత॥)
కోపగించి చూడఁబోయి గొబ్బుననుఁ గరఁగితి
చేపట్లకు దగ్గరి చేరి మొక్కితి
రాపులఁ బెనఁగఁ బోయి రతికేళికిఁ దీసితి
యేపున నాపంత మిఁక యేమి చెప్పేనే

(॥ఆత॥)
జంకించఁ బోయి నా చనుకట్లు వదలితి
వంకలొత్తఁ బోయి వానివలఁ జిక్కితి
బింకములాడఁబోయి ప్రియములెల్లాఁ జెప్పితి
యింకా నా సుద్దులు నే నేమి చెప్పేనే

(॥ఆత॥)
చలము సాదించఁబోయి సరసములాడితి
బలువు చూపఁగఁబోయి పట్టి కూడితి
యెలమి శ్రీ వేంకటేశుఁడెనసె నాతో నింత
యెలుగెత్తి నాగుణాలు యేమి చెప్పేనే

(||pallavi||)
ādani mahimo nādi aṁta mĕttani manaso
yedulu nĕmmĕlu mīdo nemi sĕppene

(||āda||)
kobagiṁchi sūḍam̐boyi gŏbbunanum̐ garam̐gidi
sebaṭlagu daggari seri mŏkkidi
rābulam̐ bĕnam̐gam̐ boyi radigeḽigim̐ dīsidi
yebuna nābaṁta mim̐ka yemi sĕppene

(||āda||)
jaṁkiṁcham̐ boyi nā sanugaṭlu vadalidi
vaṁkalŏttam̐ boyi vānivalam̐ jikkidi
biṁkamulāḍam̐boyi priyamulĕllām̐ jĕppidi
yiṁkā nā suddulu ne nemi sĕppene

(||āda||)
salamu sādiṁcham̐boyi sarasamulāḍidi
baluvu sūbam̐gam̐boyi paṭṭi kūḍidi
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍĕnasĕ nādo niṁta
yĕlugĕtti nāguṇālu yemi sĕppene