ఆతని మాఁటలో దాన వౌదువుగాక
(॥పల్లవి॥)
ఆతని మాఁటలో దాన వౌదువుగాక
నాతి నీ విభునితో నాలితనా లేఁటికే
(॥ఆత॥)
మంతనాన నిద్దరికి మనసు లొక్కటులైతే
పంతములాడఁగ మరి పనియేమే
వింతలుగా కాఁపురపు వేడుకలు వుట్టితేను
చింతతో చెక్కిటఁబెట్టే చెయ్యేఁటికే
(॥ఆత॥)
సులభాన బాయరాని చుట్టరిక మమరితే
పెలుచుగుం పెనలతో బిగువులేలే
మొలకనవ్వులతోడి ముచ్చట లబ్బితేను
చిలుకుఁ జూపులఁ జూచి సిగ్గువడ నేఁటికే
(॥ఆత॥)
గొనకొన్న కూటములు గొబ్బనఁ బొసఁగతేను
తనివోని తమకము దాఁచనేఁటికే
యెనసెను శ్రీవేంకటేశుఁడు నిన్నింతలోనె
నినుపు మోనములతో నివ్వెరగులేఁటికే
(||pallavi||)
ādani mām̐ṭalo dāna vauduvugāga
nādi nī vibhunido nālidanā lem̐ṭige
(||āda||)
maṁtanāna niddarigi manasu lŏkkaḍulaide
paṁtamulāḍam̐ga mari paniyeme
viṁtalugā kām̐purabu veḍugalu vuṭṭidenu
siṁtado sĕkkiḍam̐bĕṭṭe sĕyyem̐ṭige
(||āda||)
sulabhāna bāyarāni suṭṭariga mamaride
pĕlusuguṁ pĕnalado biguvulele
mŏlaganavvuladoḍi muchchaḍa labbidenu
silugum̐ jūbulam̐ jūsi sigguvaḍa nem̐ṭige
(||āda||)
gŏnagŏnna kūḍamulu gŏbbanam̐ bŏsam̐gadenu
tanivoni tamagamu dām̐sanem̐ṭige
yĕnasĕnu śhrīveṁkaḍeśhum̐ḍu ninniṁtalonĕ
ninubu monamulado nivvĕragulem̐ṭige