ఆతని కొక్కతెవే నీవాలవైతివా
(॥పల్లవి॥)
ఆతని కొక్కతెవే నీవాలవైతివా
యేతులు నెమ్మెలు నీవు యిందే చూపేవా
(॥ఆత॥)
యిచ్చకములెల్లా నాడి యితవరివైవిభుని
మచ్చికలు రేఁపి భ్రమలఁబెట్టేవు
కచ్చువెట్టి నేమెల్లాఁ గాచుకుండఁగా నీకు
యిచ్చోటఁ జెల్లుబడి ఇఁక నెంత గలదే
(॥ఆత॥)
వట్టినవ్వులెల్లా నవ్వి వద్దనుండి యాతని-
చుట్టమవై మాటలనే చొక్కించేవు
అట్టె నీ మిందరమును ఆసపడివుండఁగాను
నెట్టుకొని నీబలిమి నెరపఁగవలెనా
(॥ఆత॥)
చెనకి కాఁగిట నించి శ్రీవేంకటేశ్వరుని-
మనసు రంజిల్లఁజేసి మరిగించేవు
యెనసె నీతఁడే మమ్ము నీడుజోడైతిమి నేము
తనియవు నీవింకా తమకించఁదగునా
(||pallavi||)
ādani kŏkkadĕve nīvālavaidivā
yedulu nĕmmĕlu nīvu yiṁde sūbevā
(||āda||)
yichchagamulĕllā nāḍi yidavarivaivibhuni
machchigalu rem̐pi bhramalam̐bĕṭṭevu
kachchuvĕṭṭi nemĕllām̐ gāsuguṁḍam̐gā nīgu
yichchoḍam̐ jĕllubaḍi im̐ka nĕṁta galade
(||āda||)
vaṭṭinavvulĕllā navvi vaddanuṁḍi yādani-
suṭṭamavai māḍalane sŏkkiṁchevu
aṭṭĕ nī miṁdaramunu āsabaḍivuṁḍam̐gānu
nĕṭṭugŏni nībalimi nĕrabam̐gavalĕnā
(||āda||)
sĕnagi kām̐giḍa niṁchi śhrīveṁkaḍeśhvaruni-
manasu raṁjillam̐jesi marigiṁchevu
yĕnasĕ nīdam̐ḍe mammu nīḍujoḍaidimi nemu
taniyavu nīviṁkā tamagiṁcham̐dagunā