(॥పల్లవి॥)
ఆతని కితవై యటు నీవుండఁగా
కాతరించి నినుఁ గాదననేలే
(॥ఆత॥)
చక్కని వనితకు సలిగెలు చెల్లును
మక్కువ గలిగిన మగనియెడ
వెక్కసమాడిన వేడుకయై తోఁచు
కక్కసించి నినుఁ గాదన నేలే
(॥ఆత॥)
ననుపుల ఇంతికి నగవులు చెల్లును
యెనసిన తన ప్రాణేశునెడ
పెనఁగి బిగిసినా ప్రియమై తోఁచును
కనుసన్నల నిను గద్దించనేలే
(॥ఆత॥)
జవ్వనపుసతికి సరసము చెల్లును
రవ్వగ వలచిన రమణు నెడ
యివ్వల శ్రీవేంకటేశుఁడు నన్నేలె
చివ్వన నీవావి చెప్పఁగనేలె
(||pallavi||)
ādani kidavai yaḍu nīvuṁḍam̐gā
kādariṁchi ninum̐ gādananele
(||āda||)
sakkani vanidagu saligĕlu sĕllunu
makkuva galigina maganiyĕḍa
vĕkkasamāḍina veḍugayai tom̐su
kakkasiṁchi ninum̐ gādana nele
(||āda||)
nanubula iṁtigi nagavulu sĕllunu
yĕnasina tana prāṇeśhunĕḍa
pĕnam̐gi bigisinā priyamai tom̐sunu
kanusannala ninu gaddiṁchanele
(||āda||)
javvanabusadigi sarasamu sĕllunu
ravvaga valasina ramaṇu nĕḍa
yivvala śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕ
sivvana nīvāvi sĕppam̐ganelĕ