Aadani karuna galde nanniyunayyeem gaaga

ఆతని కరుణ గల్తే నన్నియునయ్యీఁ గాక
Language

(॥పల్లవి॥)
ఆతని కరుణ గల్తే నన్నియునయ్యీఁ గాక
కాతరానఁ బెడరేఁచి గాసి సేతురటవే

(॥ఆత॥)
తనబత్తే కలిగితే దండకు వచ్చీఁగాక
పెనఁగి బలిమిచేసి పిలుతురటే
మనసునఁ గలిగితే మన్నన నేలీఁ గాక
కొనచూపులను జూచి కొసరుదురటవే

(॥ఆత॥)
నవ్వు నవ్వవలసితే నామొగము చూచీఁగాక
దవ్వులనుండి చేతఁ దట్టుదురటే
రవ్వఁ జుట్టరికమైతే రతులు నేర్పీఁగాక
యివ్వలా నవ్వలా నుండి యెచ్చరింతురటవే

(॥ఆత॥)
కాఁపుర మియ్యకోలైతే కాఁగిలించుకొనీఁ గాక
మీపు రేపుఁ బై కొని మలతురటే
చేపట్టి నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు నేఁడు
రాఁపుచేసి వలపులు రచ్చ వేతురటవే

(||pallavi||)
ādani karuṇa galde nanniyunayyīm̐ gāga
kādarānam̐ bĕḍarem̐si gāsi seduraḍave

(||āda||)
tanabatte kaligide daṁḍagu vachchīm̐gāga
pĕnam̐gi balimisesi piluduraḍe
manasunam̐ galigide mannana nelīm̐ gāga
kŏnasūbulanu jūsi kŏsaruduraḍave

(||āda||)
navvu navvavalaside nāmŏgamu sūsīm̐gāga
davvulanuṁḍi sedam̐ daṭṭuduraḍe
ravvam̐ juṭṭarigamaide radulu nerbīm̐gāga
yivvalā navvalā nuṁḍi yĕchchariṁturaḍave

(||āda||)
kām̐pura miyyagolaide kām̐giliṁchugŏnīm̐ gāga
mību rebum̐ bai kŏni maladuraḍe
sebaṭṭi nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu
rām̐pusesi valabulu rachcha veduraḍave