ఆతని కన్నియు నింపులై యుండఁగా
(॥పల్లవి॥)
ఆతని కన్నియు నింపులై యుండఁగా
యీతల వెరగువడ నేలే యెవ్వరికి
(॥॥)
వలసిన రమణుని వనిత సొలసితేను
వెలయ వినఁగ నేలే వేరొకతెకు
చెలరేఁగి యాతఁడాపె చేతికి లోనై వుండఁగా
వలవని వాదు లేలే వద్దివారికి
(॥॥)
సిగ్గువడ కాపె పతిఁ జెరఁగువట్టి తియ్యఁగా
వొగ్గి విడిపించ నేలే వున్నవారికి
యెగ్గు లే కాతని కవి యేలాటాలై వుండఁగాను
కగ్గి కాంతాళించ నేలే కన్నవారికి
(॥॥)
మక్కువ నాపె గునిసి మగని తోఁ బెనఁగఁగా
చక్కట్లు దిద్ద నేలే సవతులకు
యిక్కువ శ్రీ వేంకటేశుఁడితఁడే మనలఁగూడే
వక్కణ లడుగ నేలే వావి గలవారికి
(||pallavi||)
ādani kanniyu niṁpulai yuṁḍam̐gā
yīdala vĕraguvaḍa nele yĕvvarigi
(||||)
valasina ramaṇuni vanida sŏlasidenu
vĕlaya vinam̐ga nele verŏgadĕgu
sĕlarem̐gi yādam̐ḍābĕ sedigi lonai vuṁḍam̐gā
valavani vādu lele vaddivārigi
(||||)
sigguvaḍa kābĕ padim̐ jĕram̐guvaṭṭi tiyyam̐gā
vŏggi viḍibiṁcha nele vunnavārigi
yĕggu le kādani kavi yelāḍālai vuṁḍam̐gānu
kaggi kāṁtāḽiṁcha nele kannavārigi
(||||)
makkuva nābĕ gunisi magani tom̐ bĕnam̐gam̐gā
sakkaṭlu didda nele savadulagu
yikkuva śhrī veṁkaḍeśhum̐ḍidam̐ḍe manalam̐gūḍe
vakkaṇa laḍuga nele vāvi galavārigi