ఆడనె ఆకెచే వెంగె మాడించుకోవయ్య
(॥పల్లవి॥)
ఆడనె ఆకెచే వెంగె మాడించుకోవయ్య
తోడనె నీ సుద్ది విన దోస మయ్యా
(॥ఆడనె॥)
చిత్తము రా కొకమాట చిత్తము వ చ్చొకమాఁట
వొత్త నీతో నాడ నే నోప నయ్యా
హత్తిన ఆకెకు నీకే అలవాటు గాని మాకుఁ
దత్తరించి యింత నేయం దగ దయ్యా
(॥ఆడనె॥)
కూడినప్పు డొకచూపు కూడనప్పు డొకచూపు
యీడా నాడా రెండూ నెరఁగ మయ్యా
యేడో ఆకెకు నీకు యే మన్న నమరుఁ గాని
వీడుపడ నింత నేయ వెరతు మయ్యా
(॥ఆడనె॥)
సంతసించి వొకనవ్వు సంతంసించ కొకనవ్వు
మంతు కెక్కి తొల్లె యివి మానితి మయ్యా
చెంతలఁ గూడితి నన్ను శ్రీవెంకటేశ యాకె
పంత మాడుఁ గాని మాకుఁ బాడి గా దయ్యా
(||pallavi||)
āḍanĕ āgĕse vĕṁgĕ māḍiṁchugovayya
toḍanĕ nī suddi vina dosa mayyā
(||āḍanĕ||)
sittamu rā kŏgamāḍa sittamu va schŏgamām̐ṭa
vŏtta nīdo nāḍa ne noba nayyā
hattina āgĕgu nīge alavāḍu gāni māgum̐
dattariṁchi yiṁta neyaṁ daga dayyā
(||āḍanĕ||)
kūḍinappu ḍŏgasūbu kūḍanappu ḍŏgasūbu
yīḍā nāḍā rĕṁḍū nĕram̐ga mayyā
yeḍo āgĕgu nīgu ye manna namarum̐ gāni
vīḍubaḍa niṁta neya vĕradu mayyā
(||āḍanĕ||)
saṁtasiṁchi vŏganavvu saṁtaṁsiṁcha kŏganavvu
maṁtu kĕkki tŏllĕ yivi mānidi mayyā
sĕṁtalam̐ gūḍidi nannu śhrīvĕṁkaḍeśha yāgĕ
paṁta māḍum̐ gāni māgum̐ bāḍi gā dayyā