Aadamgalamaada laabe naadavayyaa nee

ఆడఁగలమాట లాపె నాడవయ్యా నీ
Language

(॥పల్లవి॥)
ఆడఁగలమాట లాపె నాడవయ్యా నీ-
వేడుకలోనివారము వేరొకర మయ్యేమా

(॥ఆడఁ॥)
చిత్తమువచ్చినవారే చేరి నవ్వఁజెల్లుఁగాక
కొత్తవారు నవ్వఁబోతే కోపముగాదా
హత్తి వూరకున్నారంటా నండవారి సొలసేవు
విత్తక తొలుతే పైరు వేరే కలుగునా

(॥ఆడ॥)
కడుదగ్గరినవారే కైదం డియ్యఁ జెల్లుఁగాక
యెడపులవా రిచ్చితే నెరవే కాదా
తడసి కొలువువారు దగ్గరరంటాఁ దిట్టేవు
వడిగొన్న వానలేని వఱదలు గలవా

(॥ఆడఁ॥)
వురము అలమేల్‌మంగ వొరయఁగఁ జెల్లుఁగాక
వరుసవా రొరసితే వాసిరేఁగవా
గరిమ శ్రీవేంకటేశ కమ్మటి మమ్ముఁ గూడితి
సరసమాడినవావే సతమై నిలిచెఁగా

(||pallavi||)
āḍam̐galamāḍa lābĕ nāḍavayyā nī-
veḍugalonivāramu verŏgara mayyemā

(||āḍam̐||)
sittamuvachchinavāre seri navvam̐jĕllum̐gāga
kŏttavāru navvam̐bode kobamugādā
hatti vūragunnāraṁṭā naṁḍavāri sŏlasevu
vittaga tŏlude pairu vere kalugunā

(||āḍa||)
kaḍudaggarinavāre kaidaṁ ḍiyyam̐ jĕllum̐gāga
yĕḍabulavā richchide nĕrave kādā
taḍasi kŏluvuvāru daggararaṁṭām̐ diṭṭevu
vaḍigŏnna vānaleni vaṟadalu galavā

(||āḍam̐||)
vuramu alamel‌maṁga vŏrayam̐gam̐ jĕllum̐gāga
varusavā rŏraside vāsirem̐gavā
garima śhrīveṁkaḍeśha kammaḍi mammum̐ gūḍidi
sarasamāḍinavāve sadamai nilisĕm̐gā