Aadamgala maadalellaa naadidi nenu

ఆడఁగల మాటలెల్లా నాడితి నేను
Language

(॥పల్లవి॥)
ఆడఁగల మాటలెల్లా నాడితి నేను
వేడుకలిన్నియుఁ జెల్లె విచారములేఁటికి

(॥ఆడఁగల॥)
కంటిమి నీగుణములు కన్నులఁ జూచినపుడే
వింటిమి నీసుద్దులెల్ల వేగుదాఁకాను
తొంటివలెఁ గాదు నీవు దొరవైతివిఁకనేమి
అంటేఁ జవులు గావు ఆయనాయఁ బనులు

(॥ఆడఁగల॥)
పట్టితినంగమచ్చెము భావించి చూచినపుడె
పెట్టితి నీమీఁదనొక్క పెనునేరమి
దిట్టవైతివిన్నిటాను తెరవలకాఁగిటను
యెట్టుననరాదు నిన్నునిఁక నేల కొసర

(॥ఆడఁగుల॥)
చేకొంటి నీచేఁతలు చేయి ముంచినప్పుడే
దాకొంటి నీరతులలో దగ్గరి నేఁడు
యీకడ శ్రీవేంకటేశ యిరవైన మోహముల-
నేకమైతిమిద్దరము నిఁకనేల మరఁగు

(||pallavi||)
āḍam̐gala māḍalĕllā nāḍidi nenu
veḍugalinniyum̐ jĕllĕ visāramulem̐ṭigi

(||āḍam̐gala||)
kaṁṭimi nīguṇamulu kannulam̐ jūsinabuḍe
viṁṭimi nīsuddulĕlla vegudām̐kānu
tŏṁṭivalĕm̐ gādu nīvu dŏravaidivim̐kanemi
aṁṭem̐ javulu gāvu āyanāyam̐ banulu

(||āḍam̐gala||)
paṭṭidinaṁgamachchĕmu bhāviṁchi sūsinabuḍĕ
pĕṭṭidi nīmīm̐danŏkka pĕnunerami
diṭṭavaidivinniḍānu tĕravalagām̐giḍanu
yĕṭṭunanarādu ninnunim̐ka nela kŏsara

(||āḍam̐gula||)
segŏṁṭi nīsem̐talu seyi muṁchinappuḍe
dāgŏṁṭi nīradulalo daggari nem̐ḍu
yīgaḍa śhrīveṁkaḍeśha yiravaina mohamula-
negamaidimiddaramu nim̐kanela maram̐gu