Aadamgala maada lellaa naadaraadaa

ఆడఁగల మాట లెల్లా నాడరాదా
Language

(॥పల్లవి॥)
ఆడఁగల మాట లెల్లా నాడరాదా - నీ
కూడిన వేడుకలకుఁ గొలఁ దున్నదా

(॥ఆడ॥)
ఆనతియ్యరాదా న న్నాడుమన్న మాట లెల్లా
మానినిరో విభుఁ జూచి మఱచితివా
మోనమున నుండ నేల మొక మిదె యద్ద మిదె
యీ నీ విభునిసంది నేరు వారీనా

(॥ఆడ॥)
యెచ్చరించరాదా నీ కిచ్చిన బాస లెల్లా
ముచ్చట నీ విభుఁ జూచి మొకమోటమా
యెచ్చిన మీమీలోని యింపులవే సొంపులవే
రచ్చల సముఖముల రాయబారాలా

(॥ఆడ॥)
జట్టి గొనరాదా సతమై నీవద్దనుండ
గట్టిగా శ్రీతిరువేంకట విభుని
నెట్టుకొన్న కౌఁగి లిదె నీకు నీకు మరుఁడు చే
ముట్టి మీ వదనములు ముద్దిరించెనా

(||pallavi||)
āḍam̐gala māḍa lĕllā nāḍarādā - nī
kūḍina veḍugalagum̐ gŏlam̐ dunnadā

(||āḍa||)
ānadiyyarādā na nnāḍumanna māḍa lĕllā
māniniro vibhum̐ jūsi maṟasidivā
monamuna nuṁḍa nela mŏga midĕ yadda midĕ
yī nī vibhunisaṁdi neru vārīnā

(||āḍa||)
yĕchchariṁcharādā nī kichchina bāsa lĕllā
muchchaḍa nī vibhum̐ jūsi mŏgamoḍamā
yĕchchina mīmīloni yiṁpulave sŏṁpulave
rachchala samukhamula rāyabārālā

(||āḍa||)
jaṭṭi gŏnarādā sadamai nīvaddanuṁḍa
gaṭṭigā śhrīdiruveṁkaḍa vibhuni
nĕṭṭugŏnna kaum̐gi lidĕ nīgu nīgu marum̐ḍu se
muṭṭi mī vadanamulu muddiriṁchĕnā