ఆతఁడు తానే మన్నించినపుడు నన్ను
(॥పల్లవి॥)
ఆతఁడు తానే మన్నించినపుడు నన్ను
చేతికి లోనుగానే చెప్పవే నా వలపు
(॥॥)
తలఁపు దెలుకో దయపుట్ట మాటలాడు
చలము సాదించకు చతురునితో
సొలయకు సారె సారె చూపు వినయములే
చెలియరో యీ రీతిఁ జెప్పవే నా వలపు
(॥॥)
యెదుటనే నిలుచుండు ఇచ్చకమే పచరించు
పదరకు మెంతయినా పతితోడను
పొదిగి కొలువు సేయి పుట్టించు వేడుక లెల్లా
చెదరకుండాఁ దగిలి చెప్పవే నా వలపు
(॥॥)
మొక్కుము నా మారుగాను మునుకొని యెచ్చరించు
వెక్కసాన దూరకు శ్రీ వేంకటేశ్వరు
తక్కక నన్నింతలోనే తా నిందు విచ్చేసి కూడే
చెక్కు నొక్కి యింకానుఁ జెప్పవే నా వలపూ
(||pallavi||)
ādam̐ḍu tāne manniṁchinabuḍu nannu
sedigi lonugāne sĕppave nā valabu
(||||)
talam̐pu dĕlugo dayabuṭṭa māḍalāḍu
salamu sādiṁchagu sadurunido
sŏlayagu sārĕ sārĕ sūbu vinayamule
sĕliyaro yī rīdim̐ jĕppave nā valabu
(||||)
yĕduḍane nilusuṁḍu ichchagame pasariṁchu
padaragu mĕṁtayinā padidoḍanu
pŏdigi kŏluvu seyi puṭṭiṁchu veḍuga lĕllā
sĕdaraguṁḍām̐ dagili sĕppave nā valabu
(||||)
mŏkkumu nā mārugānu munugŏni yĕchchariṁchu
vĕkkasāna dūragu śhrī veṁkaḍeśhvaru
takkaga nanniṁtalone tā niṁdu vichchesi kūḍe
sĕkku nŏkki yiṁkānum̐ jĕppave nā valabū