ఆతఁడు చేసినభాగ్య మది యెట్టిదో
(॥పల్లవి॥)
ఆతఁడు చేసినభాగ్య మది యెట్టిదో
చేతికి వచ్చినమేలై చెంతలనే నిలిచె
(॥అతఁ॥)
చెలి నీవు పతితోడ నెలవి నవ్వినవ్వు
వెలయనాతని మతి వెన్నెలగాసె
నిలిచి కట్టెదురను నీవుండినభావము
తలకొన్నముంగిటినిదా(దా?) నమై నిలిచె
(॥అతఁ॥)
జాఱకుండా రమణునిఁ జక్కఁగఁ జూచినచూపు
మీఱి యాతనిమేనిపై మెఱుఁగు లెక్కె
వేఱులేక నీవిప్పుడు వీడెమిచ్చిన భావము
ఆఱడితో మదనుని అడపమై నిలిచె
(॥అతఁ॥)
తోడనే శ్రీవేంకటేశుతో నీవాడినమాటలు
జాడ నాతనిచెవులకు చవులు మించె
కూడితివి యింతోనే కూరిమి నీరతి యిదె
పాడితో యింటిలోపలిబండారమై నిలిచె
(||pallavi||)
ādam̐ḍu sesinabhāgya madi yĕṭṭido
sedigi vachchinamelai sĕṁtalane nilisĕ
(||adam̐||)
sĕli nīvu padidoḍa nĕlavi navvinavvu
vĕlayanādani madi vĕnnĕlagāsĕ
nilisi kaṭṭĕduranu nīvuṁḍinabhāvamu
talagŏnnamuṁgiḍinidā(dā?) namai nilisĕ
(||adam̐||)
jāṟaguṁḍā ramaṇunim̐ jakkam̐gam̐ jūsinasūbu
mīṟi yādanimenibai mĕṟum̐gu lĕkkĕ
veṟulega nīvippuḍu vīḍĕmichchina bhāvamu
āṟaḍido madanuni aḍabamai nilisĕ
(||adam̐||)
toḍane śhrīveṁkaḍeśhudo nīvāḍinamāḍalu
jāḍa nādanisĕvulagu savulu miṁchĕ
kūḍidivi yiṁtone kūrimi nīradi yidĕ
pāḍido yiṁṭilobalibaṁḍāramai nilisĕ