ఆతఁడు నీవు నేకమై అనుభవింతువుగాక
(॥పల్లవి॥)
ఆతఁడు నీవు నేకమై అనుభవింతువుగాక
రీతిగాని చలములు రేఁచఁగా రాదమ్మా
(॥ఆత॥)
మారుమాట లేమిటికి మంతనము లేమిటికి
కూరిమిగలవారికి కొన్నదే కోలు
నేరుపరివిభుఁడు నీవద్దికి వచ్చె
బీరపునీయలుకలు పెంచఁగరాదమ్మా
(॥ఆత॥)
మల్లాడనేమిటికి మాటలాడనేమిటికి
చెల్లుబడి గలితూ సేసినదే చేఁత
కొల్లలుగా నానలు వెట్టుకొని పతి నమ్మించె
పల్లదపు నీవెంగేలు పనికిరాదమ్మా
(॥ఆత॥)
సిగ్గువడనేమిటికి చెక్కుచేయి యేమిటికి
అగ్గమై మీలోనఁ బట్టినదే పంతము
వొగ్గి శ్రీవేంకటేశుఁడు వొనగూడె నిన్ను నిట్టె
వెగ్గళించి నిఁకనేమి వెలితిలేదమ్మా
(||pallavi||)
ādam̐ḍu nīvu negamai anubhaviṁtuvugāga
rīdigāni salamulu rem̐sam̐gā rādammā
(||āda||)
mārumāḍa lemiḍigi maṁtanamu lemiḍigi
kūrimigalavārigi kŏnnade kolu
nerubarivibhum̐ḍu nīvaddigi vachchĕ
bīrabunīyalugalu pĕṁcham̐garādammā
(||āda||)
mallāḍanemiḍigi māḍalāḍanemiḍigi
sĕllubaḍi galidū sesinade sem̐ta
kŏllalugā nānalu vĕṭṭugŏni padi nammiṁchĕ
palladabu nīvĕṁgelu panigirādammā
(||āda||)
sigguvaḍanemiḍigi sĕkkuseyi yemiḍigi
aggamai mīlonam̐ baṭṭinade paṁtamu
vŏggi śhrīveṁkaḍeśhum̐ḍu vŏnagūḍĕ ninnu niṭṭĕ
vĕggaḽiṁchi nim̐kanemi vĕlidiledammā